Change : అక్కడ మార్పు కోరుకున్నారు..ఇక్కడ మార్పు వద్దనుకున్నారు

Change : దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి.

Change

దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. అందరూ ఊహించినట్టు రెండు చోట్ల అధికార పార్టీలకే ఓటర్లు మొగ్గుచూపితే మూడు పెద్ద రాష్ట్రాల్లో మాత్రం మార్పు(Change) కోరుకున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ఓటర్లు మార్పు(Change) కోరుకున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

ఆ ఐదు రాష్ట్రాల్లో అందరినీ ఆకర్షించిన రెండు పెద్ద రాష్ట్రాల్లో ముందుగా బెంగాల్ నే చెప్పుకోవాలి. గత మూడు దఫాలుగా ఇక్కడ తిరుగులేని విజయం సాధించిన మమతా బెనర్జీ మరోసారి గెలుస్తుందని ఆ పార్టీ వర్గాలు ధీమాగా కనిపించాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించిన బీజేపీ ఈసారి పక్కా వ్యూహంతో బెంగాల్ ను కైవసం చేసుకుంది.

దీదీ పాలనలో కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో మమతా బెనర్జీ తీసుకున్న చర్యలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ప్రభావం చూపింది. పైగా మూడు పర్యాయాలుగా టీఎంసీకి అవకాశమిచ్చిన బెంగాల్ ప్రజలు ఈసారి బీజేపీ వైపు మొగ్గుచూపారు. మార్పు కోరుకున్న మెజార్టీ ప్రజలు కాషాయ పార్టీకే ఓట్లు వేసినట్టు అర్థమవుతోంది.

అటు తమిళనాడులోనూ ఇదే పరిస్థితి. కానీ ప్రతీసారీ అయితే డీఏంకే లేకుంటే అన్నాడీఏంకేకే తమిళ ప్రజలు పట్టం కడుతున్నారు. జాతీయపార్టీలకు ఇక్కడ స్థానమే లేదు. ఎప్పటి నుంచో పాతుకుపోయిన రెండు ద్రవిడ పార్టీల పునాదులను కదిల్చిన విజయ్ టీవీకే పార్టీ ఇక్కడ ఘనవిజయం సాధించింది.

Change

దాదాపు ఐదు దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఏంకే పార్టీల పాలన చూసిన తమిళ ప్రజలు విజయ్ కు అవకాశమిచ్చి చూద్దామని భావించారు. దీంతో ఇక్కడ కూడా అధికారం మార్పు జరిగింది. దాదాపు 100కు పైగా సీట్లతో కొత్త సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఇక కేరళలో కూడా ఓటర్లు మార్పుకే మొగ్గుచూపారు. ఫలితంగా కమ్యూనిస్టుల కోట బద్దలైంది. అధికార ఎల్‌డీఎఫ్ కూటమి ఘోరపరాజయం పాలైంది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

ఇదిలా ఉంటే అసోం, పుదుచ్చేరిలో మాత్రం అధికార పార్టీలనే కొనసాగించేందుకు ఓటర్లు మొగ్గుచూపారు. ఫలితంగా అసోంలో బీజేపీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లే సాధించింది. అటు పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమే విజయం సాధించింది.

Vijay : విజయ్ గ్రౌండ్ వర్క్ అదుర్స్.. దళపతి గెలుపునకు కారణాలివే

Exit mobile version