Just NationalJust PoliticalLatest News

Vijay : విజయ్ గ్రౌండ్ వర్క్ అదుర్స్.. దళపతి గెలుపునకు కారణాలివే

Vijay : తమిళనాడులో విజయ్ చరిత్ర సృష్టించారు. రెండు బలమైన పార్టీలను ఢీకొట్టి అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు

Vijay

తమిళనాడులో విజయ్ చరిత్ర సృష్టించారు. రెండు బలమైన పార్టీలను ఢీకొట్టి అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. నిజానికి విజయ్(Vijay )పార్టీ పెట్టినప్పుడు , ఎన్నికలకు ముందు కూడా టీవీకేపై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే డీఎంకే , అన్నాడీఏంకే తరహాలో బలమైన క్యాడర్ లేదు. సంస్థాగత నిర్మాణం లేదు. ప్రజలను ఆకర్షించే నేతలు కూడా లేరు.

మరి విజయ్(Vijay )టీవీకే పార్టీ ఇంతటి గొప్ప విజయాన్ని ఎలా సాధించింది… అసలు విజయ్ గెలుపుకు కారణాలేంటి… ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ కి ఈ విజయం అంత ఆషామాషీగా రాలేదు. దీని వెనుక చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు. ఏదో పార్టీ పెట్టాం… మనకున్న చరిష్మాతో గెలిచేస్తాంలే అని అనుకోలేదు. ఎందుకంటే తమిళనాడులో సినీనటులను ప్రజలు ఎంతగా ఆరాధించినా రాజకీయాల దగ్గరకు వచ్చేటప్పటికీ వారి మద్దతు పొందడం అంత సులువు కాదు.

విజయ్ కాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్ వంటి వారు ఎంతటి స్టార్ డమ్ ఉన్నా పాలిటిక్స్ లో సక్సెస్ కాలేదు. విజయ్ ది మాత్రం భిన్నమైన ప్రయాణం. కష్టాల నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమా స్టార్ గా ఎదిగాడు. నటుడిగా అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడే ప్రజాసేవలోనూ నిలిచాడు. అందరిలా పబ్లిసిటీ చేసుకోకుండా సైలెంట్ గా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ క్రమంలో అక్కడి యువతలో క్రేజ్ సంపాదించుకున్నాడు. వ్యక్తిగతంగానూ విజయ్ పై ఎలాంటి మచ్చలు లేవు.

అన్నింటికంటే ముఖ్యంగా పాలిటిక్స్ లో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. వ్యూహాలు, ఎత్తుకు పై ఎత్తులు, విమర్శలు, ప్రతివిమర్శలు ఇలా అన్నింటిలోనూ ఆరితేరాలి. పైగా విజయ్ కు సొంత మీడియా లేదు. నిజానికి విజయ్ పెద్ద మాటకారి కూడా కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఇదే ఆయనకు పెద్ద అడ్వాంటేజ్ అయింది. అలాగే విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇస్తేనే రాజకీయాల్లో ఉనికి ఉంటుందన్న అభిప్రాయం కూడా తప్పని నిరూపించారు.

ఎందుకంటే తన రాజకీయ ప్రసంగాల్లో ఏరోజూ విజయ్ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తనపై వ్యక్తిగత విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోలేదు. వాటికి జవాబు కూడా ఇవ్వలేదు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో మాత్రమే చెప్పారు. అలాగే మేనిఫెస్టో విషయంలో విజయ్ తీసుకున్న శ్రద్ధ టీవీకే విజయానికి బాగా దోహదపడింది.

Vijay
Vijay

మహిళలు, రైతులు, విద్యార్థులే లక్ష్యంగా మేనిఫెస్టోను ప్రకటించారు. ఇక టీవీకే అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చాలా సూటిగా సుత్తిలేకుండా స్పష్టంగా చెప్పడంలో సక్సెస్ అయ్యారు. తన ప్రసంగాల్లో కూడా విజయ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వకుండా ఎలాంటి మంచి చేస్తారో మాత్రమే వివరించారు.

ఇది విజయ్ ను అభిమానించే యువతతో పాటు మిగిలిన వర్గాలను ఆకట్టుకుంది. అలాగే టికెట్ల కేటాయింపులోనూ విజయ్ మార్క్ స్పష్టంగా కనిపించింది. కాగా ఇప్పటికే డీఏంకే, ఏఐడీఎంకేకు అవకాశాలిచ్చిన తమిళ ప్రజలు విజయ్ కు ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ఆలోచనతో మద్దతు పలికారు. అందుకే ఎప్పటినుంచో పాతుకుపోయిన రెండు బలమైన పార్టీలను ఢీకొట్టి విజిల్ మోత మోగించిన విజయ్ ఎంజీఆర్ తర్వాత తమిళనాట అరంగేట్రంలోనే గెలిచిన నటుడిగా రికార్డులకెక్కారు.

Vijay Trisha: చరిత్ర సృష్టించిన విజయ్..ట్రెండింగ్ లో త్రిష

Related Articles

Back to top button