Apple Pay
భారత్‌లో యూపీఐ సృష్టించిన ఈ రివల్యూషన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇన్నిరోజులూ ఈ డిజిటల్ గేమ్‌లో మెయిన్‌గా ఫోన్‌పే, గూగుల్ పే మాత్రమే రాజ్యమేలుతుండగా.. ఇప్పుడు ఒక సైలెంట్‌గా యాపిల్ పే(Apple Pay) భారత్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. ఐఫోన్ చేతిలో ఉంటే చాలు చెల్లింపుల ఎక్స్‌పీరియన్స్ మారిపోయేలా.. ఈ గ్లోబల్ టెక్ దిగ్గజం ఇండియా కోసం ఒక బిగ్ గేమ్ ప్లాన్ రెడీ చేసింది.
ఈ కొత్త సర్వీస్ స్టార్టింగ్‌లో మాత్రం మనకు డైలీ అలవాటైన క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో రావడం లేదు. దానికి బదులుగా పీఓఎస్ మెషీన్లపై కేవలం మీ మొబైల్ లేదా యాపిల్ వాచ్‌ను జస్ట్ అలా ట్యాప్ చేసి చెల్లింపులు చేసే ‘ట్యాప్ అండ్ పే’ టెక్నాలజీతో ఇంట్రడ్యూస్ కాబోతోంది. దీని కోసం స్పెషల్‌గా ప్లాస్టిక్ కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేదు.
ఫేమస్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ జర్నీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చిన్న చిన్న సరుకులు, పానీపూరి బండ్ల దగ్గర యూపీఐ స్కాన్ చేసేవారికి ఇది స్టార్టింగ్‌లో పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింట్లోనూ నడిచే ఫోన్‌పే, గూగుల్ పేలా కాకుండా.. యాపిల్ పే(Apple Pay) ఓన్లీ ఐఫోన్, యాపిల్ వాచ్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అయితే రాబోయే రోజుల్లో యాపిల్ పే డైరెక్టుగా డొమెస్టిక్ యూపీఐ నెట్‌వర్క్‌తో జతకట్టే ఆలోచనలో ఉందనే వార్తలు టెక్ వరల్డ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఒక్కసారి ఇదే కనుక నిజమైతే.. ప్రతీసారీ ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి, పిన్ నెంబర్ ఎంటర్ చేసే తిప్పలు అసలు ఉండవు.
స్క్రీన్ లాక్‌లో ఉన్నప్పుడే జస్ట్ ఫేస్ ఐడీ , టచ్ ఐడీ వెరిఫికేషన్‌తో సెకన్ల వ్యవధిలో పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఐఫోన్ కస్టమర్లకు ఈ ఫీచర్ ఒక కొత్త ఫీల్‌ని ఇస్తుందనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్‌పే మార్కెట్లో ఎంత బలంగా ఉన్నా.. యాపిల్ పే యూపీఐలోకి పూర్తి రేంజ్‌లో అడుగుపెడితే మాత్రం.. ఇండియన్ డిజిటల్ పేమెంట్స్ సెక్టార్‌లో ఒక డిజిటల్ వార్ మొదలవ్వడం గ్యారంటీ.
Relatives : రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నారా? ఎంత ఆత్మీయులైనా సరే ఈ హద్దులు దాటకండి..
