Arunachalam : తెరుచుకున్న అరుణాచల మోక్ష మార్గం.. కానీ భక్తులు ఈ రూల్స్ పాటించాల్సిందే..

Arunachalam : అరుణాచలంలోని మోక్షమార్గాన్ని మళ్లీ తెరిచిన అధికారులు.. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని  కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టారు.

Arunachalam

భారతదేశంలో అత్యంత మహిమ కలిగిన శైవక్షేత్రంగా అరుణాచలానికి(Arunachalam) పేరుంది. ఈశ్వరుడు కొండ రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మధ్యకాలంలో ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. ముఖ్యంగా పౌర్ణమి రోజున, మహాశివరాత్రి రోజున ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. అందులోనూ గిరి ప్రదిక్షణకు భక్తులు పోటెత్తుతారు.

అలాగే అరుణాచలం(Arunachalam)లో ఉండే మోక్షమార్గానికి చాలా ప్రత్యేకత ఉంది. గుహ ఆకారంలో ఉండే ఈ చిన్న ఆలయంలో వెనుక ద్వారం గుండా పడుకుని లోపలికి వెళ్లి, పాకుతూ బయటకు వస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. గిరిప్రదక్షిణ మార్గంలోని ఈ మోక్ష ద్వారం గుండా వెళితే ఎంతో మంచిదని భక్తుల నమ్మకం. ఈ మోక్ష మార్గం నుంచి ప్రయాణిస్తే కర్మలు అన్నీ శుద్ధి అయ్యి మోక్షం లభిస్తుందంటారు.

అయితే కొంచెం లావుగా ఉండేవాళ్లు ఈ మోక్షమార్గం గుండా వెళ్లడం చాలా కష్టం. ఇటీవల కాలంలో కొందరు భక్తులు ఇలాగే ఇబ్బందిపడి ఊపిరి తీసుకోని పరిస్థితుల్లో అందులో ఇరుక్కుపోయారు. ఒకరిద్దరు ఊపిరాడక చనిపోయారు కూడా. దీంతో కొద్ది రోజులుగా ఈ మోక్షమార్గాన్ని ఆలయ అధికారులు మూసివేశారు.

తాజాగా మోక్షమార్గాన్ని మళ్లీ తెరిచిన అధికారులు.. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని  కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టారు. మోక్ష మార్గంలోకి వెళ్లే ముందు అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఇనుమ గ్రిల్స్‌తో కూడిన గేటును దాటాల్సి ఉంటుంది. ఈ గ్లిల్స్ మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళితేనే మోక్షమార్గంలోకి అనుమతిస్తారు.

Arunachalam

కొంచెం ఎక్కువ బరువు , లావుగా ఉన్న భక్తులు మోక్షమార్గంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు. రిస్క్ తీసుకుని మోక్షమార్గంలో ప్రవేశించొద్దని కోరుతున్నారు.

స్థూలకాయులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు మోక్షం మార్గంలోకి వెళ్లడంపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి.

ఇకపై వాటిని మరింత కఠినంగా అమలు చేయనున్నారు. అరుణాచలేశ్వరుడిని స్మరించడం, గిరి ప్రదక్షిణ చేయడం, అరుణాచల క్షేత్ర దర్శనమే నిజమైన మోక్ష మార్గమని, మోక్ష మార్గం గుండా వెళ్లి ఇబ్బందులు పడొద్దన ఇటు పండితులు కూడా చెబుతున్నారు.

Fatty Liver : ఫేస్‌పై ఈ చిన్న మార్పులు కనిపిస్తున్నాయా? అవి ఫ్యాటీ లివర్ ఇచ్చే సైలెంట్ వార్నింగ్స్..

Exit mobile version