Railway : రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్.. 11 వేల ఏఎల్పీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Railway : కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయస్సులో సడలింపు లభిస్తుంది.

Railway

నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తెచ్చింది. దేశవ్యాప్తంగా రైల్వే (Railway) నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే విధంగా, దాదాపు 11 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఆధ్వర్యంలో జరగనున్న ఈ నియామక ప్రక్రియ ద్వారా సికింద్రాబాద్‌తో పాటు దేశంలోని మెయిన్ సిటీలు అయిన బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతా వంటి అన్ని రీజియన్లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్ నాలెడ్జి కలిగి ఉండి, రైల్వే రంగంలో స్థిరపడాలనుకునే యూత్‌కు ఇది ఒక సువర్ణావకాశం.

ఈ రైల్వే (Railway) పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే క్యాండిడేట్లు పదో తరగతి పాస్ అవడంతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ITI) లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే, జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 – 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయస్సులో సడలింపు లభిస్తుంది. దీనివల్ల నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితి విషయంలో వెసులుబాటు కలుగుతుంది.

సెలక్షన్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు 2 దశల ఆన్‌లైన్ రిటెన్ టెస్ట్‌లను (CBT 1 – CBT 2) ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిలో ట్యాలెంట్ కనబరిచిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్‌గా సెలక్షన్ చేస్తారు.

Railway

ఈ పోస్టులకు సెలక్టయిన వారికి నెలకు రూ. 19,900 స్టార్టింగ్ శాలరీతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లభించే ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా, గౌరవప్రదమైన జీవనోపాధిని ,మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది.

ఆసక్తి కలిగిన క్యాండిడేట్లు మే 15, 2026 నుంచి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి జూన్ 14, 2026 వరకు గడువు ఇచ్చారు. నోటిఫికేషన్ మే నెలలో రిలీజ్ కానుండటంతో.. క్యాండిడేట్లు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేసుకోవడం మంచిది. సరైన అర్హతలు, ఆసక్తి ఉన్నవారు గడువు ముగిసేలోపు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Visakhapatnam : విశాఖ దశ మార్చిన గూగుల్..విశాఖ చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టం

Exit mobile version