Cheque Book
మీరు ఇప్పటికీ ఆస్తుల కొనుగోలు కోసం, బిజినెస్ డీల్స్‌కి లేదంటే లోన్ ఈఎమ్‌ఐలకి చెక్కులనే నమ్ముకుంటున్నారా? అయితే వెంటనే మీ చెక్ బుక్ ఓపెన్ చేసి దానిలో స్పెషల్ కోడ్ ఉందో లేదో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేకపోతే మాత్రం మీ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా సగంలోనే ఆగిపోయి, బ్యాంక్ చుట్టూ తిరిగే పరిస్థితి రావొచ్చు.
ఆన్‌లైన్ , డిజిటల్ యూపీఐ పేమెంట్లు వాడుతున్నా సరే.. చాలామంది ఇప్పటికీ బ్యాంక్ చెక్కులనే లీగల్ రికార్డ్ అండ్ ప్రూఫ్ కోసం వాడుతున్నారు. కానీ, ఫేక్ చెక్కులు, ట్యాంపరింగ్ మోసాలు నెక్స్ట్ లెవెల్‌కి చేరిపోవడంతో.. వీటికి పక్కాగా చెక్ పెట్టడానికి బ్యాంకింగ్ సెక్టార్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్ అనే సరికొత్త సెక్యూరిటీ వెపన్‌ను ఫీల్డ్‌లోకి దించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) తో పాటు కొన్ని టాప్ బ్యాంకులు తమ పాత చెక్ బుక్స్ ప్లేస్‌లో ఈ కొత్త వర్షన్ చెక్ బుక్స్‌ను మార్చుకోవాలని అకౌంట్ హోల్డర్స్‌కు హెచ్చరిస్తున్నాయి. అక్షరాలు అండ్ అంకెల కలయికతో (Alpha-numeric code) ఉండే ఈ కోడ్ వల్ల చెక్ క్లియరింగ్ ప్రాసెస్ అయ్యే టైమ్‌లో నకిలీదా లేక నిజమైనదా అనేది సిస్టమ్ క్షణాల్లోనే పసిగడుతుంది.
దొంగ సంతకాలు అలాగే అమౌంట్ మార్చేసి ట్యాంపరింగ్ చేసే ఫ్రాడ్స్‌కి ఈ కోడ్ ఫుల్ స్టాప్ పెడుతుంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) తో చెక్ క్లియరింగ్ వేగాన్ని విపరీతంగా పెంచేసింది. గతంలోగా చెక్ పేపర్‌ను ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్‌కి పంపించాల్సిన పని లేకుండా, డిజిటల్ ఇమేజ్ ద్వారా సెకన్లలోనే క్లియరింగ్ ప్రొసీజర్ పూర్తి చేస్తూ కస్టమర్ల టైమ్‌తో పాటు సెక్యూరిటీని కూడా కాపాడుతోంది.
ఇదే టైమ్‌లో రూ. 50వేలు అంతకంటే ఎక్కువ వ్యాల్యూ ఉన్న పాత చెక్కులు వాడేవారికి 2026 డిసెంబర్ 31 డెడ్‌లైన్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది అన్ని బ్యాంకులకు కలిపి ఆర్బీఐ ఇచ్చిన అధికారిక డెడ్‌లైన్ కాదు. ప్రతీ బ్యాంకుకు వారి వారి సొంత పాలిసీలతో పాటు కొన్ని నిబంధనలు ఉంటాయి. కాబట్టి మీ పాత చెక్ బుక్ ఇంకా వర్కవుట్ అవుతుందో లేదో మీ బ్యాంక్ అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్‌సైట్ లేదంటే డైరెక్ట్‌గా హోమ్ బ్రాంచ్‌కి కానీ వెళ్లి కనుక్కోవడమే మంచిది.
బిజినెస్ రన్ చేసేవారు, పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ డీలింగ్స్ చేసేవారు మాత్రం ఈ గైడ్‌లైన్స్‌ను అస్సలు లైట్ తీసుకోవద్దు. బ్యాంక్ నుంచి కొత్త చెక్ బుక్ తీసుకోమని మెసేజ్ వస్తే కనుక వెంటనే అప్లై చేయడం మంచిది. ఇక ఛార్జీల విషయంలో బ్యాంక్ అకౌంట్ టైప్‌ని బట్టి క్లైంట్స్ కి కొత్త చెక్ బుక్‌ను ఇస్తారు.
ఉదాహరణకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 25 చెక్ లీవ్స్ ఉచితంగా ఇస్తుంది. అంతకంటే ఎక్కువ కావాలంటే మాత్రం సర్వీస్ ఛార్జీలు పడతాయి. ఇకపోతే చెక్ రాసిన డేట్ నుంచి కేవలం 3 నెలలు మాత్రమే దానికి వాలిడిటీ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అంతేకాకుండా ఒకవేళ మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ లేక లేదంటే ఇంకేదైనా రీజన్‌తో చెక్ బౌన్స్ అయితే మాత్రం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్-1881 లోని సెక్షన్ 138 కింద.. చట్టపరమైన కేసులతో పాటు జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి.
Rakhi Pournami : రాఖీ పౌర్ణమి 2026 ఆగస్టు 27నా? 28నా?.. ఆరోజే చంద్రగ్రహణం కాబట్టి రాఖీ కట్టొచ్చా?
