Rakhi Pournami : రాఖీ పౌర్ణమి 2026 ఆగస్టు 27నా? 28నా?.. ఆరోజే చంద్రగ్రహణం కాబట్టి రాఖీ కట్టొచ్చా?
Rakhi Pournami : 2026లో ఆగస్టు 27, ఆగస్టు 28 రెండు రోజులను కూడా రక్షా బంధన అని ప్రస్తావించడంతో ప్రతి ఒక్కరిలో రాఖీ డేట్‌పై డౌట్ వీడటం లేదు.
Rakhi Pournami
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు జరుపుకొనే రక్షాబంధన్ అంటే మన భారతీయులకు ఒక ఎమోషన్. సంస్కృతంలో రక్ష అంటే కాపాడటం, బంధన్ అంటే ముడి వేయడం.. అంటే ప్రొటెక్టివ్ బాండ్ అని అర్థం. ప్రతీ ఏడాది ఎంతో సంబరంగా జరుపుకొనే ఈ వేడుక.. ఈసారి మాత్రం ఓ కన్ఫ్యూజన్‌ను మోసుకొచ్చింది. అక్కా ,చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి, ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఓవైపు సిద్ధం అవుతుంటే.. అసలు రాఖీ ఏ రోజు కట్టాలనే దానిపై సోషల్ మీడియా అండ్ పంచాంగాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.
ఈ 2026లో ఆగస్టు 27, ఆగస్టు 28 రెండు రోజులను కూడా రక్షా బంధన అని ప్రస్తావించడంతో ప్రతి ఒక్కరిలో రాఖీ డేట్‌పై డౌట్ వీడటం లేదు. అయితే ఈ కన్ఫ్యూజన్‌కు పండితులు చెక్ పెట్టేశారు. ఆగస్టు 28వ తేదీనే రాఖీ పౌర్ణమి పండుగను అంతా జరుపుకోవాలని క్లారిటీ ఇచ్చారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం చూస్తే.. శ్రావణ మాసపు శుక్లపక్ష పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీన ఉదయం 9 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. కానీ, ఆ తిథి ఆగస్టు 28 వ తేదీ ఉదయం 9 గంటల 48 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. మన సనాతన సంప్రదాయం ప్రకారం సూర్యోదయం సమయానికి ఏ తిథి ఉంటే దానినే ఆ రోజంతా కన్సిడర్ చేస్తారు కాబట్టి, ఆగస్టు 28న ఉదయం పౌర్ణమి తిథి ఉండటంతో అదే రోజు పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
అంతేకాకుండా, పూజలు చేయడానికి, రాఖీలు కట్టడానికి అడ్డంకిగా మారే.. భద్రకాలం ఆగస్టు 28న సూర్యోదయానికంటే ముందే ముగిసిపోతుందని పంచాంగ నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ఆగస్టు 28వ తేదీన ఉదయం పూట రాఖీ కట్టడానికి మంచి ముహూర్తం ఉంటుందని అంటున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి,అలాగే లోకల్ సూర్యోదయ సమయాలను బట్టి ముహూర్తాల్లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు కాబట్టి, మీ ఊరి స్థానిక పంచాంగకర్తలను, పండితులను ఫాలో అవ్వడం కూడా మంచిదే.

మరోవైపు ఈఏడాది రాఖీ పౌర్ణమి(Rakhi Pournami) రోజే చంద్రగ్రహణం కూడా వస్తుండటంతో.. గ్రహణం పట్టిన టైమ్‌లో రాఖీలు కట్టొచ్చా లేదా? అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కూడా పండితులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చంద్రగ్రహణం మన దేశంలో అసలు కనిపించదని.. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎలాంటి సూతక కాలం పాటించాల్సిన అవసరం కూడా లేదని వివరిస్తున్నార. కాబట్టి ఎలాంటి భయాలు, సెంటిమెంట్లు, అనుమానాలు మనసులో పెట్టుకోకుండా ఆగస్టు 28వ తేదీన ఎంతో సంతోషం రక్షాబంధన్ పండుగను జరుపుకోవచ్చని పండితులు స్పష్టం చేశారు.
Kaaka : మెగా158 నుంచి కాకా క్రేజీ సర్ప్రైజ్..3 నిమిషాల గ్లింప్స్‌తో మైండ్ బ్లాక్..





