EPFO
ఉద్యోగాలు మారే హడావుడి, పాత వివరాలు దొరక్కపోవడం ఇలా రకరకాల కారణాలతో చాలామంది తమ పాత పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులను అలానే వదిలేస్తుంటారు. అయితే ఏళ్ల తరబడి అకౌంట్లలోనే ఉండిపోయిన పీఎఫ్ డబ్బును చాలా ఈజీగా ప్రస్తుత అకౌంట్‌లోకి మార్చుకోవడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో(EPFO)) ఒక కొత్త ఆధార్ ఆధారిత డిజిటల్ పోర్టల్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.
లోక్‌సభలో ఎంపీ వి.కె. శ్రీకందన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇటీవల అఫీషియల్‌గా సమాధానమిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. ఉద్యోగులు తమ కష్టానికి ప్రతిఫలంగా దాచుకున్న ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా చూడటానికి ఈ కొత్త సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడనుంది.
చాలామంది ఉద్యోగులు తమ కెరీర్‌లో భాగంగా రకరకాల కంపెనీలు మారుతుంటారు. అలా మారిన ప్రతీసారి పాత పీఎఫ్ అకౌంట్ల వివరాలను సరిగ్గా నోట్ చేసుకోకపోవడం, లేక పాత యూఏఎన్ (UAN) నెంబర్లు మర్చిపోవడం వల్ల పాత ఖాతాల్లోని డబ్బులు అలాగే ఉండిపోతాయి. ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ నెంబర్లు ఉండడం వల్ల కూడా ఈ సమస్య మరీ ఎక్కువయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి పరిష్కారంగానే ఈ కొత్త సిస్టమ్‌ను డిజైన్ చేశారు.
దీనికోసం ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయిన ఉద్యోగులు. ఇప్పుడు తమ ఆధార్ కార్డుతో కేవలం ఒక్కసారి వెరిఫై చేసుకుంటే చాలు. వారి పేరు మీద వేర్వేరు కంపెనీల్లో యాడ్ అయిన పాత పీఎఫ్ డిపాజిట్లను ఈజీగా గుర్తుపట్టి, ఆ మొత్తాన్ని తాజాగా వాడుతున్న పీఎఫ్ అకౌంట్‌కు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు లేదంటే ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు.
ఈ పోర్టల్ పనిచేసే తీరు కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. పూర్తిగా ఆధార్ కేవైసీ బేస్ మీద పనిచేయడం వల్ల ఎలాంటి ఫేక్ ప్రొఫైల్స్‌కి ఛాన్స్ ఉండదు. దీని కోసం పాత కంపెనీల చుట్టూ తిరిగే పనిలేకుండా, పేపర్‌వర్క్ వంటి హెడేక్ లేకుండా డిజిటల్‌గానే నిమిషాల్లో పనైపోతుంది.
అయితే ఒక్క విషయాన్ని ఉద్యోగులు కచ్చితంగా గుర్తుంచుకోవాలని.. తమ వద్ద ఎలాంటి వివరాలు, ఐడీలు లేనివారికి మాత్రం ఈ పోర్టల్ ద్వారా సాయం చేయలేమని మంత్రి స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా తమ పాత అకౌంట్లను తామే స్వయంగా గుర్తుపట్టగలిగిన వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ పాత యూఏఎన్ లేకపోతే మాత్రం, ఈపీఎఫ్‌వో(EPFO) మెంబర్ పోర్టల్‌లోని UAN Allotment for Existing PF Account’ అనే ఆప్షన్ వాడి కొత్త యూఏఎన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ నిర్ణయం ఎంత పెద్ద విప్లవమో ఆర్టీఐ (RTI) లెక్కలను చూస్తే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. 2026 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 30.91 లక్షల వాడని పీఎఫ్ అకౌంట్లలో రూ. 9,330 కోట్లకు పైగా డబ్బులు ఎవరూ క్లెయిమ్ చేయకుండా అలానే పడి ఉన్నాయి. కాబట్టి మీ ఓల్డ్ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు ఉండిపోతే, వెంటనే ఈ పోర్టల్‌లోకి వెళ్లి మీ ఆధార్‌తో చెక్ చేసుకుని ఆ డబ్బును మీ కరెంట్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.
మీ పాత పీఎఫ్ అకౌంట్ వివరాలను చెక్ చేసుకుని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ఈ అధికారిక పోర్టల్ లింక్‌ను ఉపయోగించొచ్చు..
Pooja Room : దేవుడి గదిలో ఈ ఒక్క పొరపాటు చేసినా కష్టాలే..ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి?
