Gold And Silver
శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం పూజ కోసం, అలాగే పెళ్లిళ్ల షాపింగ్ కోసం బంగారం, వెండి కొందామని ప్లాన్ చేస్తున్నవారికి షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఒక్కరోజే రికార్డు స్థాయిలో పెరిగి కొనుగోలుదారులకు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచే పైపైకి ఎగబాకుతున్న బంగారం రేట్లు, ఆగస్ట్ 20 గురువారం రోజు మరోసారి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీలు అయిన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే ఏకంగా రూ. 4వేల300 పెరిగి రూ. 1లక్ష59వేల270 వద్దకు చేరింది. ఇక బంగారు నగల కోసం వాడే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 3వేల950 పెరిగి రూ. 1 లక్ష46వేల వద్ద ట్రేడ్ అవుతోంది.
బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతుండగా, చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 2వేల180 పెరిగి రూ. 1లక్ష59,270 దగ్గరకు, 22 క్యారెట్లు రూ. 2వేలు పెరిగి రూ. 1లక్ష46వేలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్లు రూ. 1లక్ష59వేల420 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1లక్ష46వేల150 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి కొందామన్నా కూడా బాంబు పేలినట్టే పరిస్థితి ఉంది. హైదరాబాద్, చెన్నైలలో కిలో సిల్వర్ కాస్ట్‌పై ఒక్కరోజే రూ. 10వేలు పెరిగి ఏకంగా రూ. 2.60 లక్షల మార్కును తాకింది. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2.55 లక్షలు పలుకుతోంది. మొత్తంగా పండుగల సీజన్‌లో ఈ రేంజ్‌లో ధరలు రెక్కలు విప్పుకోవడంతో.. సామాన్యులు నిరాశకు గురవుతున్నారు.
