Sivakarthikeyan : సీఎం విజయ్ దారిలోనే మరో యంగ్ హీరో .. సంచలనం రేపుతున్న శివ కార్తికేయన్ స్కెచ్

Sivakarthikeyan : చెన్నైలో శివ కార్తికేయన్ నిర్వహించిన ఫ్యాన్స్‌ మీట్ పొలిటికల్ రూమర్లకు స్ట్రాంగ్ రెక్కలు తొడుగుతోంది. దాదాపు 2 వేల మందికి పైగా హాజరైన భారీ మీటింగ్‌లో ఫ్యాన్స్ అందరూ ఒకే లాంటి వైట్ షర్ట్‌లు వేసుకుని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Sivakarthikeyan

తమిళనాడు పాలిటిక్స్‌కు, వెండితెరకు విడదీయరాని బంధం ఉందనేది మరోసారి ప్రూవ్ అయింది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్ వంటి సినీ దిగ్గజాలు పాలిటిక్స్‌లో చక్రం తిప్పిన బాటలోనే.. దళపతి విజయ్ తన తమిళ వెట్రి కజగం’ (TVK)తో సంచలన విజయాన్ని సాధించి తమిళనాడు సీఎంగా పీఠాన్ని అధిరోహించడం దీనికి తార్కాణమే.

సినిమా తారలకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో, ఇప్పుడు కోలీవుడ్ నుంచి మరికొంతమంది యంగ్ హీరోలు కూడా పొలిటికల్ ఎంట్రీకి గ్రాండ్ స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. మొన్నటి వరకు ధనుష్ పేరు ఈ మొదటి వరుసలో వినిపించగా.. ఇప్పుడు యంగ్ సెన్సేషన్ శివ కార్తికేయన్ పేరు తమిళ పొలిటికల్ స్ట్రీట్‌లో విపరీతంగా మారుమోగిపోతోంది.

తాజాగా చెన్నైలో శివ కార్తికేయన్(Sivakarthikeyan) నిర్వహించిన ఫ్యాన్స్‌ మీట్ ఈ పొలిటికల్ రూమర్లకు స్ట్రాంగ్ రెక్కలు తొడుగుతోంది. దాదాపు 2 వేల మందికి పైగా హాజరైన ఈ భారీ మీటింగ్‌లో ఫ్యాన్స్ అందరూ ఒకే లాంటి వైట్ షర్ట్‌లు వేసుకుని రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా శివ కార్తికేయన్ ఇమేజ్ ఉన్న ప్రత్యేక జెండాలు, బ్యానర్లు ప్రదర్శించడమే కాకుండా ఫ్యూచర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దీంతో ఇది కేవలం సినీ ఫంక్షన్ లేదా ఫ్యాన్స్ మీట్ ఒకటే కాదని, ఇది పక్కా పొలిటికల్ డ్రామాకు ప్లాన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇటు శివ కార్తికేయన్(Sivakarthikeyan) కూడా ముఖ్యమంత్రి విజయ్ లాగే సొంతంగా కొత్త పార్టీని పెట్టి రాజకీయ చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నారా? లేక ఇప్పటికే ఉన్న పార్టీల్లో దేనికైనా మద్దతు తెలుపుతారా అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

కాకపోతే ఈ వేదికపై మాట్లాడిన శివ కార్తికేయన్(Sivakarthikeyan) పొలిటికల్ స్టేట్‌మెంట్స్ ఏవీ డైరెక్టుగా ఇవ్వకపోయినా.. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. తనను సెల్ఫ్‌మేడ్ స్టార్ అని పిలవడం కంటే ..పీపుల్ మేడ్ స్టార్ అని పిల్చుకోవడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చారు.

Sivakarthikeyan

తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రజలు, అభిమానులేనని చెప్పుకొచ్చిన శివ కార్తికేయన్.. ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యాలపై క్లారిటితో ఉండాలని, అనవసర విమర్శలను అస్సలు పట్టించుకోవద్దని అన్నారు. బాగా చదువుకుని, కష్టపడి సంపాదించి కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని.. ప్రతిరోజూ కనీసం పావు గంట అయినా బుక్స్ చదివే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మరోవైపు తమిళనాడులో హీరోలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండటం, వారు రెగ్యులర్‌గా ఇలాంటి గ్రాండ్ మీటింగ్‌లు పెట్టడం కామన్ అని మరికొంతమంది కొట్టి పారేస్తున్నారు. కాకపోతే తమిళనాడులో ఇప్పుడు విజయ్ సీఎంగా ఉన్నప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్ కోడ్, పొలిటికల్ జెండాలు, ఫ్యూచర్ సీఎం నినాదాలతో శివ కార్తికేయన్ ఫ్యాన్స్ చేసిన ఈ హంగామా అంతా చూస్తుంటే.. కోలీవుడ్‌లోనే కాక తమిళ రాజకీయాలలోనూ కొత్త సమీకరణాలకు తెరలేపేలాగే కనిపిస్తోంది.

Plastic Notes : కాగితపు నోట్లకు గుడ్ బై..రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లతో ఆర్‌బీఐ ప్రయోగం..

↑
Exit mobile version