Gold Rate Down
బంగారం పేరు వింటేనే మగువల ఫేస్‌లో ఎక్కడ లేని వెలుగు వస్తుంది. అటువంటిది ఎప్పుడూ ఆకాశాన్ని తాకే బంగారం ధరలు మెల్లమెల్లగా కిందికి దిగి వస్తుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కొద్ది రోజులుగా పుత్తడి ప్రియులకు ఊరటనిచ్చే వార్తలు వినిపిస్తున్నాయి.
వరుసగా 4 రోజులుగా గోల్డ్ ధరలు తగ్గుతూ వస్తుండటంతో మగువలు హ్యాపీగా షాపింగ్ బాట పడుతున్నారు. దసరా పండుగ సీజన్ నుంచి గోల్డ్ మార్కెట్‌లో ఈ తగ్గుదల మొదలైంది. కేవలం నాలుగు రోజుల్లోనే తులం బంగారంపై సుమారు రూ. 4 వేల వరకు ధర తగ్గడం విశేషం.
అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న అనూహ్య పరిణామాలే ఈ రేట్ల పతనానికి అసలు కారణమని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు గోల్డ్ ధర ఏకంగా 20 డాలర్లు తగ్గి ప్రస్తుతం 4,006 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
దీని ప్రభావం మన దేశీ మార్కెట్లపైన కూడా బానే పడింది. తెలుగు రాష్ట్రాల మెయిన్ సిటీలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1లక్ష42వేల480 వద్ద ఉండగా, జ్యువెలరీ కోసం వాడే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1లక్ష30వేల600 వద్ద స్థిరపడింది.
దేశ రాజధానితో పోలిస్తే హైదరాబాద్ దగ్గర రేట్లు సుమారు అలాగే ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే కిలో సిల్వర్ ధర రూ. 2లక్షల25వేల వద్దే కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ మంత్ ఎండ్ నాటికి గోల్డ్ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
