Komic Village
రోడ్లు సరిగ్గా లేని ఊరికి వెళ్లాలంటేనే ఆలోచిస్తాం. అలాంటిది మేఘాలను తాకుతూ ఆకాశానికి తాకుతుందా అన్నట్లుండే ఊరికి వెళ్లాలంటే ఇంకెంత ఆలోచిస్తామో కదా. అలాంటి ఊరిలో ఆక్సిజన్ కూడా సరిగ్గా దొరకని 15,050 అడుగుల ఎత్తులో, కొండల నడుమ మధ్య కొంతమంది జీవిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్ స్పితి జిల్లాలో ఉన్న కోమిక్ గ్రామం.. దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గ్రాస్ రూట్ ప్రాంతంగా రికార్డులకెక్కిన ఈ గ్రామానికి వాహనాలు వెళతాయి. ఆకాశానికి అత్యంత దగ్గరలో ఉన్న భారత గ్రామం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సముద్ర మట్టానికి దాదాపు 4,587 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
భారత్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ అరుదైన కోమిక్ గ్రామం(Komic Village)లో కేవలం 130 మంది మాత్రమే నివసిస్తున్నారు. టిబెటన్ బౌద్ధమతాన్ని పాటించే ఇక్కడి ప్రజలు మట్టి, రాళ్లతో కట్టి వైట్ కలర్‌తో అందమైన ఇళ్లలోనే జీవిస్తుంటారు.
ఊరి ఎంట్రన్స్‌లోనే ప్రపంచంలోనే వెహకల్ రోడ్డు ఉన్న అత్యంత ఎత్తైన గ్రామం అని బోర్డు కనిపిస్తుంది. అక్కడ ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ ప్రాంతంలో.. బతకడం మాత్రం క్షణక్షణం సవాలే అవుతుంది.
శీతల ఎడారిగా పిలిచే ఈ ఎత్తైన పర్వత ప్రాంతంలో ఏడాదికి సుమారు 6 నెలల పాటు విపరీతమైన మంచు కురిసి దారులన్నీ మూసుకుపోతాయి. ఆ సమయంలో బయట ప్రపంచంతో వీరికి ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. ఇంటర్నెట్, నెట్‌వర్క్ కనెక్టివిటీ, స్కూళ్లు, హాస్పిటల్స్ వంటి కనీస సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
అయితే ఇక్కడి ప్రజలంతా ఈ వాతావరణానికి ఎప్పుడో అలవాటు పడిపోయారు. గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నా కూడా తట్టుకోవడానికి వీలుగా వారి బాడీలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి నేచురల్‌గానే ఎక్కువగా ఉంటుంది.
విపరీతంగా వణికించే చలి నుంచి కాపాడుకోవడానికి.. దట్టమైన మట్టి గోడలతో వారి ఇళ్లను డిజైన్ చేసుకుంటారు. చెట్లు పెరగని ప్రాంతం కావడంతో జంతువుల పేడనే వంట కోసం ఉపయోగిస్తుంటారు. బతుకుతెరువు కోసం యాక్‌లు, గొర్రెలు, మేకలు పెంచుకోవడమే ఇక్కడి వారి వృత్తి.
ఈ ఊరిలో శతాబ్దాల నాటి టాంగ్యుడ్ బౌద్ధ మఠం మెయిన్ అట్రాక్షన్. అంతేకాక పురాతన టెథిస్ సముద్రపు జీవుల శిలాజాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే లాంగ్జా..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీసు ఉన్న హిక్కిం ఊరు కూడా ఈ కోమిక్‌కు చాలా దగ్గరలోనే ఉంటాయి. కఠిన పరిస్థితులు ఉన్నా కూడా ఈ ఊరి ప్రజలు ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటూ పండుగలు చేస్తుంటారు.
ఆకాశాన్ని తాకే ఈ లోయ సౌందర్యాన్ని చూడాలని.. టూరిస్టులకు ఎంత ఆశగా ఉన్నా, ఒక్కసారిగా ఆ ఎత్తుకి వెళ్తే ఆక్సిజన్ కొరత వల్ల ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. అందుకే అక్కడి క్లైమేట్‌కు అలవాటు పడ్డాకే ఇలాంటి సాహస యాత్రలు చేయాలని ట్రావెల్ ఎక్స్‌పర్ట్స్ సలహా ఇస్తున్నారు.
Babymoon : హనీమూన్,బడ్డీమూన్ తెలుసు.. మరి సమంత చెప్పిన బేబీమూన్ గురించి తెలుసా?
