Just LifestyleJust EntertainmentLatest News

Babymoon : హనీమూన్,బడ్డీమూన్ తెలుసు.. మరి సమంత చెప్పిన బేబీమూన్ గురించి తెలుసా?

Babymoon : ప్రతీ మహిళ జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక మరుపురాని తీయని అనుభూతి. అయితే ఆ ఆనందంతో పాటు శారీరక మార్పులు, హార్మోన్ల అసమతౌల్యత వల్ల వచ్చే ఒత్తిడి, కొత్త బాధ్యతలు ఇబ్బందులు పెడతాయి.

Babymoon

మ్యారేజ్ అవగానే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వెళ్లే జాలీ ట్రిప్ హనీమూన్, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్లే విహారయాత్ర బడ్డీమూన్ గురించి మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బేబీమూన్(Babymoon) అనే కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది.

ఇటీవల హీరోయిన్ సమంత దీని పేరును చెప్పడంతో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. ఏంటీ బేబీమూన్.. తల్లిదండ్రులు కాబోతున్న వారికి ఇదెలా ఉపయోగపడుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రతీ మహిళ జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక మరుపురాని తీయని అనుభూతి. అయితే ఆ ఆనందంతో పాటు శారీరక మార్పులు, హార్మోన్ల అసమతౌల్యత వల్ల వచ్చే ఒత్తిడి, కొత్త బాధ్యతలు ఇబ్బందులు పెడతాయి. అంతేకాదు కాబోయే తల్లి మనసులో ఎన్నో భయాలు, అనుమానాలు, ఆందోళనలు మెదులుతుంటాయి.

అందుకే ఈ సమయంలో అన్ని టెన్షన్లకు దూరంగా.. దంపతులిద్దరూ తమ డైలీ లైఫ్‌కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి, ప్రశాంతంగా గడపడానికి ప్లాన్ చేసుకునే టూర్‌నే ‘బేబీమూన్’ అంటారు.

సాధారణంగా గర్భధారణ జరిగిన 14 – 28 వారాల మధ్య కాలాన్ని సెకండ్ ట్రైమిస్టర్ అంటారు. దీనిని బేబీమూన్ కోసం బెస్ట్ టైమ్‌గా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలోనే వాంతులు, వికారం తగ్గి శరీరం కాస్త కుదుటపడుతుంది.

అయితే బేబీమూన్‌ కోసం అరకు, అనంతగిరి హిల్స్, ఊటీ, కూర్గ్, గోవా బీచ్‌ వంటి ప్రశాంతమైన ప్రదేశాలు బాగుంటాయి. కేవలం దంపతులే కాదు..వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లి డెలివరీ తర్వా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అలాగే బిడ్డ బాధ్యతలను ఎలా పంచుకోవాలి, ఆర్థిక విషయాల గురించి ముందే మాట్లాడుకోవడం వల్ల ఎమోషనల్ అటాచ్‌మెంట్ స్ట్రాంగ్ అవుతుంది.

బేబీమూన్ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందుగా గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, ప్రయాణాలు చేయొచ్చా లేదా అని చెక్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న ప్రాంతానికి దగ్గరలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్‌, ఎన్‌ఐసీయూ (NICU) ఫెసిలిటీలున్న హాస్పిటల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. వికారం లేదా కాంప్లికేషన్లు ఎక్కువ ఉన్నవాళ్లు బేబీమూన్‌కు ప్లాన్ చేయకపోవడమే బెటర్.

Babymoon
Babymoon

ప్రయాణాల్లో ఫ్యాషన్ కంటే కంఫర్ట్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లూజ్ బట్టలు, విటమిన్ టాబ్లెట్లు, సౌకర్యంగా ఉండే దిండు వెంట తీసుకెళ్లాలి. బయటి తిండికి వీలైనంత దూరంగా ఉంటూ.. ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆరోగ్యకరమైన స్నాక్స్, ప్రొటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి.

దూరప్రయాణాలు అసలు పడవని అనుకునేవారు వీకెండ్స్‌లో దగ్గరలోని వెల్ నెస్ రిట్రీట్స్, స్పాలకు వెళ్లొచ్చు. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా నడవడం, తేలికపాటి ఎక్సర్‌సైజులు, మెడిటేషన్ చేయడం వల్ల హార్మోన్ల ఒత్తిడి తగ్గి.. మనసు ప్రశాంతంగా మారుతుంది. మొత్తంగా సరైన జాగ్రత్తలతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ బేబీమూన్(Babymoon).. మీ లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

Breakup Pain : బ్రేకప్ పెయిన్ తగ్గడం లేదా? ఫేక్ ఐడీలతో మాజీలను ట్రాక్ చేస్తున్నారా?

Related Articles

Back to top button