Tatkal Tickets : ఆగస్టు 1 నుంచి తత్కాల్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..ఇక గంటల తరబడి నిలబడాల్సిన పనిలేదు

Tatkal Tickets : టోకెన్ జారీ చేసే సమయం సరిగ్గా లేకపోవడంతో ఒకసారి టోకెన్ కోసం ఆ తర్వాత మరోసారి టికెట్ బుకింగ్ కోసం ఇలా టూ టైమ్స్ కౌంటర్ వద్దకు రావలసి వచ్చేది

Tatkal Tickets

తత్కాల్ టికెట్‌ కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో పెద్ద యుద్ధమే చేస్తారు. ఉదయాన్నే పరుగులెట్టి మరీ క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసినా చివరికి వెయిటింగ్ లిస్ట్ రావడం , టికెట్ దొరక్కపోవడం వంటి ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తుంటారు .

ఈ రద్దీని అరికట్టడంతో పాటు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి తాజాగా రైల్వే శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైల్వే కౌంటర్ల వద్ద పారదర్శకతను పెంచడానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి సవరించిన నూతన టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది.

ఈ న్యూ పాలసీ ప్రకారం తత్కాల్ టికెట్ల(Tatkal Tickets) కోసం ఇచ్చే టోకెన్ల టైమ్‌లను ఫిక్స్ చేశారు. ఏసీ క్లాస్ టికెట్లు కావాల్సిన వారు ఉదయం 8:30 గంటల నుంచి 9:00 గంటల మధ్య టోకెన్ల కోసం వెళ్తే సరిపోతుంది. అలాగే నాన్-ఏసీ లేదా స్లీపర్ క్లాస్ టికెట్ల కోసం వచ్చే వారు ఉదయం 9:00 గంటల నుంచి 9:30 గంటల మధ్య టోకెన్లు ఇచ్చే టైమ్‌కు వెళ్లాలి.

అంతేకాకుండా ప్రతి కౌంటర్‌ వద్ద లిమిటెడ్‌గానే టోకెన్లు కేటాయించనున్నారు. ఏసీ కేటగిరీలో ఒక కౌంటర్‌కు గరిష్ఠంగా 10 టోకెన్లు, నాన్-ఏసీ విభాగంలో 15 టోకెన్లు మాత్రమే ఇస్తారు. అయితే ఏదైనా స్పెషల్ అకేషన్స్ లేదా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ టోకెన్ల సంఖ్యను పెంచడం కానీ తగ్గించడం కానీ చేసే పూర్తి అధికారం స్థానిక రైల్వే అధికారులకు ఉంటుంది.

గతంలో ఉన్న టోకెన్ విధానం వల్ల ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యేవారు. టోకెన్ జారీ చేసే సమయం సరిగ్గా లేకపోవడంతో ఒకసారి టోకెన్ కోసం ఆ తర్వాత మరోసారి టికెట్ బుకింగ్ కోసం ఇలా టూ టైమ్స్ కౌంటర్ వద్దకు రావలసి వచ్చేది. దీనివల్ల ప్రయాణికుల టైమ్ వేస్ట్ అవ్వడమే కాక స్టేషన్లలో తోపులాటలు జరిగేవి. కొత్తగా తీసుకొచ్చిన ఈ పర్టిక్యులర్ టైమింగ్స్ వల్ల ఒకేసారి ప్రశాంతంగా పని పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.

టోకెన్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా, బ్లాక్ మార్కెటింగ్ లేదా దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపడానికి వీలుగా రూల్స్‌ను మరింత కఠినతరం చేశారు. కొత్త రూల్ ప్రకారం టోకెన్ పొందే ప్రతి ప్రయాణికుడు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన మరో గుర్తింపు కార్డును కూడా అధికారులకు చూపించాలి.

Tatkal Tickets

అంతేకాకుండా ఒకరికి కేటాయించిన టోకెన్‌ను ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ చేయకూడదు. ప్రయాణం చేసే వ్యక్తి కౌంటర్ వద్దకు వచ్చినా లేదా వారి కుటుంబ సభ్యుల కోసం టికెట్ తీసుకుంటున్నా (కేటగిరీ-ఏ) వారికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కౌంటర్ల వద్ద తత్కాల్(Tatkal Tickets) బుకింగ్ ప్రాసెస్‌ను ఈజీ చేయడం, సామాన్య ప్రయాణికుడికి కరెక్ట్ టైమ్‌లో టికెట్ అందేలా చూడటమే ఈ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Esha Singh : పసిడి గురి తప్పని ఇషా సింగ్.. షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం

Exit mobile version