Just SportsLatest News

Esha Singh : పసిడి గురి తప్పని ఇషా సింగ్.. షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం

Esha Singh : కేవలం 13 ఏళ్ల వయసులోనే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సీనియర్ కేటగిరీలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత.. ప్రతీ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఇషా సింగ్ ప్రదర్శన అత్యుత్తమంగానే సాగుతోంది

Esha Singh

అంతర్జాతీయ వేదికపై హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ మరోసారి అదరగొట్టింది. కొంతకాలంగా అద్భుతమైన విజయాలతో దూసుకెళుతున్న ఇషా మరోసారి ప్రపంచకప్‌లో మెరిసింది. చైనాలోని హ్యాంగ్ చౌ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం గెలుచుకుంది.

25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ తుది పోరులో ఇషా సింగ్(Esha Singh) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. నిలకడగా రాణించి 40 హీట్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ రికార్డుతో బరిలో నిలిచిన ఆమె ఆరంభం నుంచే ఆధిపత్యం కనబరిచింది. 50 షాట్‌లకు 40 పాయింట్లు సాధించింది. ఈ ప్రదర్శనతో అగ్రస్థానాన్ని సాధించి స్వర్ణాన్ని అందుకుంది.

37 షాట్లతో చైనాకు చెందిన యూ జాంగ్ రజతం సాధించగా, మరో భారత షూటర్, ఒలింపిక్ మెడల్ విజేత మను బాకర్ మూడోస్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది. స్వర్ణపతకమే లక్ష్యంగా బరిలోకి దిగినా కాంస్యం కోసం కొరియా షూటర్ జియోంగ్‌తో తలపడింది. డబుల్ షూట్ ఆఫ్‌లో మను భాకర్ గెలిచింది. ఓవరాల్‌గా ఇషా సింగ్, మను భాకర్ విజయాలతో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు డబుల్ పోడియం దక్కినట్టయింది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య మూడుకు చేరింది.

వచ్చే ఒలింపిక్స్‌లో మెడల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇషా సింగ్ దానికి తగ్గట్టే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. మే 2026 లో జర్మనీలోని మ్యూనిచ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో ఆమె వరల్డ్ రికార్డు నెలకొల్పింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 50 పాయింట్లకు గాను 43 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది.

Esha Singh
Esha Singh

కేవలం 13 సంవత్సరాల వయసులోనే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సీనియర్ కేటగిరీలో జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత ప్రతీ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఇషా సింగ్ ప్రదర్శన అత్యుత్తమంగానే సాగుతోంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నా మెడల్ చేజారింది.

ఈసారి లాస్ ఏంజెలిస్‌లో మాత్రం పోడియంపై నిలబడతానని ఇషా సింగ్(Esha Singh) ధీమాగా ఉంది. వచ్చే ఆసియా క్రీడల్లోనూ ఇషా సింగ్‌పై భారీ అంచనాలున్నాయి. 2024లో హాంగ్‌ఝౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో ఇషా సింగ్ మొత్తం నాలుగు పతకాలను గెలుచుకుని రికార్డులకెక్కింది.

Karur Stampede : సీఎం విజయ్ ప్రభుత్వానికి షాక్..కరూర్ బాధితులకు ఉద్యోగాల ఉత్తర్వులు రద్దు

Related Articles

Back to top button