PF Limit Increase : పీఎఫ్ లిమిట్ రూ.25 వేలకు పెంపు..ఉద్యోగులకందరికీ నిజంగా శుభవార్తేనా?

PF Limit Increase : పీఎఫ్ లిమిట్ రూ.25 వేలకు పెరగడం వల్ల ఇలాంటి కంపెనీలకి రూపాయి నష్టం ఉండదు కానీ, ఎంప్లాయి చేతికి వచ్చే నెలకు సరిపడే క్యాష్ ఇన్ హ్యాండ్ బాగా పడిపోతుందన్న టెన్షన్‌ వేధిస్తోంది.

PF Limit Increase

ప్రైవేట్ ఎంప్లాయిస్ లైఫ్‌లో పీఎఫ్ అనేది ఒక రకమైన సెక్యూరిటీ నెట్ వంటిది. అయితే ఇన్నాళ్లూ నెలకు రూ.15 వేల లోపు బేసిక్ ఉండేవాళ్లకు మాత్రమే తప్పనిసరిగా ఉండే ఈ పీఎఫ్ పరిమితిపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు పెంచుతూ లేబర్ మినిస్ట్రీ ఇచ్చిన ప్రపోజల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

2014లో రూ.6,500 నుంచి రూ.15 వేలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం, సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన జీవో రానుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కొత్తగా 51 లక్షల మంది ప్రైవేట్ ఎంప్లాయిస్ పీఎఫ్ వేతన పరిధిలోకి వస్తారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.11,339 కోట్లు కేటాయించింది.

సాధారణంగా బేసిక్ జీతంలో 12 శాతం పీఎఫ్ కింద కట్ అవుతుంది. పాత లిమిట్ ప్రకారం అయితే నెలకు గరిష్టంగా రూ.1,800 కట్ అయ్యేవి. కానీ ఇప్పుడు పెంచిన రూ.25 వేల వేతన పరిమితి అమల్లోకి వస్తే కనుక, ప్రతి నెల మీ అకౌంట్‌ నుంచి పీఎఫ్ కింద రూ.3,000 వరకు కట్ అవుతుంది. అంటే మీ మంత్లీ సేవింగ్స్ పెరుగుతాయి, రిటైర్మెంట్ కార్పస్ కూడా భారీగా జమ అవుతుంది. అయితే, ఈ మార్పు వెనుక ప్రైవేట్ ఉద్యోగులకు లాభం ఎంత? నష్టం ఎంత? అనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది.

కానీ చాలామంది ఉద్యోగుల్లో ఈ నిర్ణయంతో తమ చేతికి వచ్చే జీతం (Take-Home Salary) తగ్గిపోతుంది కదా అనే ఒక అనుమానం మెదులుతోంది. చట్ట ప్రకారం ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, అలాగే కంపెనీ యాజమాన్యం మరో 12 శాతం మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ చెల్లించాలి.

PF Limit Increase

కానీ దేశంలోని చాలా ప్రైవేట్ కంపెనీలు ఈ రూల్స్‌ని ఏమాత్రం పాటించడం లేదు. కాస్ట్ టు కంపెనీ (CTC) పేరు చెప్పి, కంపెనీ చెల్లించాల్సిన ఆ 12 శాతం షేర్‌ను కూడా ఎంప్లాయి టోటల్ శాలరీ ప్యాకేజీ నుంచే మినహాయిస్తున్నాయి. ఇప్పుడు పీఎఫ్ వేతన లిమిట్ రూ.25 వేలకు పెరగడం వల్ల ఇలాంటి కంపెనీలకి రూపాయి నష్టం ఉండదు కానీ, ఎంప్లాయి చేతికి వచ్చే నెలకు సరిపడే క్యాష్ ఇన్ హ్యాండ్ బాగా పడిపోతుందన్న టెన్షన్‌ వారిని వేధిస్తోంది.

నిజానికి చట్ట ప్రకారం కంపెనీ చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను ఎంప్లాయ్ శాలరీ నుంచి తగ్గించడం నేరం. లాంగ్ టర్మ్ సేవింగ్స్ పరంగా, రిటైర్మెంట్ ప్లానింగ్ పరంగా పీఎఫ్ శాలరీ లిమిట్ పెంపు ఒక డ్రీమ్ కమ్ ట్రూ వంటిదే. కానీ ప్రతి నెలా ఉద్యోగి ఇంటి ఖర్చులకు చేతిలో డబ్బులు తగ్గే సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మాత్రం.. కంపెనీలు చేస్తున్న ఈ డ్యూయల్ కట్ దోపిడీపై కేంద్ర ప్రభుత్వం స్ట్రిక్టుగా నిబంధనలు తెచ్చినప్పుడే అందరికీ అసలైన న్యాయం జరుగుతుంది.

Online Payments : అక్టోబర్ 15 నుంచి రూల్స్ ఛేంజ్..ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేముందు వీటి గురించి తెలుసుకోండి..

Exit mobile version