AAP : ఆ ఎంపీలకు ఆప్ బిగ్ షాక్..అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు

AAP : ఆప్ కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించారు. గత కొంతకాలంగా తన అద్భుతమైన ప్రసంగాలతో రాజ్యసభను హోరెత్తించిన రాఘవ్ చద్దా వీరిలో మొదటి వ్యక్తి

AAP

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. తమ ఉనికి కోసం గెలిచిన పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్లిపోయే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలో ఆప్(AAP) కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించారు. గత కొంతకాలంగా తన అద్భుతమైన ప్రసంగాలతో రాజ్యసభను హోరెత్తించిన రాఘవ్ చద్దా వీరిలో మొదటి వ్యక్తి.

మొన్నటి వరకూ బీజేపీని గుండాల పార్టీగా పేర్కొన్న ఆయన ఇప్పుడు అదే పార్టీలో చేరడం అందరినీ షాక్ కు గురిచేసింది. రాఘవ్ చద్దాతో పాటు మరో ఏడుగురు సందీప్ పాఠక్, అశోక్ కుమార్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, స్వాతి మలీవాల్,విక్రంజిత్ సింగ్ సాహ్నీ కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ ఆ షాక్ నుంచి త్వరగానే కోలుకున్నట్టు కనిపిస్తోన్న ఆప్ పార్టీ ఫిరాయించిన ఏడుగురు సభ్యులపై తర్వాతి చర్యలకు సిద్ధమైంది.

ఈ క్రమంలో బీజేపీలో చేరిన ఏడుగురు సభ్యులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసింది. దీనిలో భాగంగా రాజ్యసభ ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్ ను కలిసి ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ వినతిపత్రం అందజేశారు. ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.

అందుకే వారిని అనర్హులుగా ప్రకటించి, సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. ఇటువంటి చర్యలు ప్రజాతీర్పును అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుధ్ధంగా వ్యవహరించిన ఈ ఏడుగురిపై చర్యలకు డిమాండ్ చేశారు.

AAP

పలువురు న్యాయనిపుణులను కూడా తాము సంప్రదించామని సంజయ్ సింగ్ వెల్లడించారు. మరోవైపు ఏడుగురిలో ఒకరైన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు పంజాబ్ ప్రభుత్వం షాకిచ్చింది. గతంలో అతనికి కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి భజ్జీ ఇంటిదగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లతో సెక్యూరిటీని కల్పించింది.

బీజేపీలో చేరడంపై నిరసిస్తూ పలువురు ఆప్ కార్యకర్తలు హర్భజన్ నివాసం దగ్గర ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ భద్రతను కల్పించినట్టు తెలుస్తోంది. తాము మొదట్లో పాటించిన పార్టీ సిద్ధాంతాలు ఇప్పుడు ఆప్ లో లేవని రాఘవ్ చద్దాతో సహా మిగిలిన సభ్యులు పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆప్(ఎంపీలకు) ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.

Break :మైక్రో బ్రేక్స్.. పని మధ్యలో చిన్న విరామం ఉండాల్సిందేనా?

Exit mobile version