RBI New ATM Rules : ఏటీఎం యూజర్లకు అలర్ట్..ఫ్రీ లిమిట్, చార్జీలపై ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్స్..

RBI New ATM Rules : ఏటీఎం విత్‌డ్రాలు, ఫ్రీ ట్రాన్జాక్షన్స్ లిమిట్‌, అదనపు ఛార్జీలపై ఆర్‌బీఐ కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. ఫ్రీ ట్రాన్జాక్షన్స్ లిమిట్‌ దాటితే ఛార్జీలు ఎలా ఉంటాయి?

RBI New ATM Rules

దేశంలోని బ్యాంక్ అకౌంట్‌ హోల్డర్స్ ఏటీఎం లావాదేవీల నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక స్పెషల్ సర్క్యూలర్ రిలీజ్ చేస్తూ క్లారిటీ(RBI New ATM Rules) ఇచ్చింది. ఫ్రీ ట్రాన్జాక్షన్స్ లిమిట్‌, ఆ పరిమితి పూర్తయిన తర్వాత వర్తించే ఎక్స్‌ట్రా ఛార్జీలు, టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ ఆదేశాల ప్రకారం.. ఒక అకౌంట్‌ హోల్డర్ తన సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఫ్రీ ట్రాన్జాక్షన్స్ అంటే ఆర్థిక, ఆర్థికేతర సేవలు కలిపి చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించేటప్పుడు అయితే మెట్రో సిటీలలో 3, నాన్-మెట్రో ప్రాంతాల్లో 5 ఫ్రీ ట్రాన్జాక్షన్స్‌కు అనుమతి ఉంటుంది. ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి ఎక్స్‌ట్రా ట్రాన్జాక్షన్‌కు పన్నులతో కలిపి గరిష్టంగా రూ. 23 వరకు ఛార్జీ విధించడానికి బ్యాంకులకు అనుమతినిచ్చింది. అలాగే ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచి ఒకేసారి గరిష్టంగా రూ. 10,000 మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ నిబంధనలలో బ్యాంకింగ్ కస్టమర్లకు ఊరట నిచ్చే అంశమేమిటంటే.. ఏటీఎంలో డబ్బులు లేకపోవడం వల్ల లేదా నెట్‌వర్క్, టెక్నికల్ ఇష్యూల కారణంగా లావాదేవీ ఫెయిల్ అయితే మాత్రం దానిని ఉచిత లావాదేవీల కౌంట్‌లో చేర్చకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అంతేకాకుండా అలాంటి ఫెయిల్ అయిన ట్రాన్జాక్షన్స్‌కు కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు.

మరొక ముఖ్యమైన నిర్ణయంలో.. పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్స్ వద్ద డెబిట్ కార్డులు, కేవైసీ ఉన్న ప్రీపెయిడ్ కార్డులు, యూపీఐ ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పద్ధతిలో రూ. 2,000 నుంచి రూ. 10,000 వరకు నగదు తీసుకునే అవకాశం కల్పించగా, సర్వీస్ ఛార్జీలు విధిస్తే అది ఒక శాతానికి మించకూడదు.

ఇక బ్యాంకింగేతర సంస్థలు నిర్వహించే వైట్-లేబుల్ ఏటీఎంలలోనూ కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ (ICCW) సర్వీసులను అందుబాటులోకి తేవచ్చని, దీనికి అవసరమైన క్యాష్‌ను స్పాన్సర్ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకుల నుంచి కూడా పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్బీఐ తన సర్క్యూలర్‌లో పేర్కొంది.

Emotional Availability : బంధాల్లో బాండ్ గట్టిపడాలనుకుంటున్నారా? మరి ఈ ఒక్క ఎమోషనల్ గిఫ్ట్ మీ దగ్గరుందా?

↑
Exit mobile version