Odarpu Yatra : విజయ్ ఓదార్పు యాత్రకు డేట్ ఫిక్స్ ..కరూర్ ఘటన బాధితులకు పరామర్శ

Odarpu Yatra : గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లా వేలుచమిపురంలో టీవీకే ప్రచార సభ సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Odarpu Yatra

తమిళనాడు సీఎం, టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ఓదార్పు యాత్ర(Odarpu Yatra)కు రెడీ అవుతున్నారు. గతేడాది కరూర్ జిల్లాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. దీని కోసం వచ్చే నెలలో ఓదార్పు యాత్ర(Odarpu Yatra)కు ప్లాన్ చేశారు.

అయితే ఈ యాత్ర ఎన్ని రోజులు సాగుతుందనే వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. గతంలో స్వయంగా వెళ్లి పరామర్శించాలనుకున్నా అభిమానుల తాకిడిని తట్టుకునే పరిస్థితి లేకపోవడం, భద్రతా సమస్యలు వంటి కారణాలతో అనుమతి లభించలేదు.

ఇప్పుడు సీఎం హోదాలో పూర్తి ఏర్పాట్ల మధ్య బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించాలని విజయ్ నిర్ణయించుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్ జిల్లా వేలుచమిపురంలో టీవీకే ప్రచార సభ సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

విజయ్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడం, విజయ్ రాక ఆలస్యం కావడం, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగి ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారింది.

అప్పటి స్టాలిన్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేస్తుండగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి సుప్రీమ్ కోర్ట్, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ విషాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున విజయ్ ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు.

తర్వాత ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆ సమయంలోనే మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి డైరెక్టుగా పరామర్శించాలని అనుకున్నా.. భద్రతా పరమైన సమస్యలతో సాధ్యపడలేదు. దీంతో ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో మృతుల కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు.

Odarpu Yatra

ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ బాధితుల ఇళ్లకే వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పబోతున్నారు. జూలై రెండవ వారంలో విజయ్ కరూర్‌ను సందర్శించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మొత్తం 41 మంది మృతుల కుటుంబాలను కలిసి విజయ్ వారిని ఓదార్చనున్నారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది, ఇప్పటికే విజయ్‌ను న్యాయస్థానం విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది.

Ketan Murder : కేతన్ హత్యపై పోలీసుల షాకింగ్ రిపోర్ట్..ఆ కిల్లర్స్‌కు మరో 5 రోజుల కస్టడీ

Exit mobile version