Just CrimeLatest News

Ketan Murder : కేతన్ హత్యపై పోలీసుల షాకింగ్ రిపోర్ట్..ఆ కిల్లర్స్‌కు మరో 5 రోజుల కస్టడీ

Ketan Murder : పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు ..నిందితులకు మరో 5 రోజుల పోలీస్ కస్టడీని మంజూరు చేసింది.

Ketan Murder

పూణే లోహగడ్ కోట మర్డర్ మిస్టరీలో రోజుకో భయంకరమైన నిజం బయటకు వస్తోంది. జూన్ 18న జరిగిన కేతన్ అగర్వాల్ హత్యకేసులో అరెస్ట్ అయిన కిలాడీ లేడీ సియా గోయల్, ఆమె సీక్రెట్ లవర్ చేతన్ చౌదరి తొలి విడత పోలీస్ కస్టడీ ముగియడంతో.. ఈ రోజు అంటే జూన్ 29న పోలీసులు వీరిద్దరినీ వడ్గావ్ మావల్ కోర్టులో ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా కేసు దర్యాప్తునకు సంబంధించిన మరికొన్ని విస్తుగొలిపే వాస్తవాలను పోలీసులు కోర్టు ముందు ఉంచారు. నేరానికి సంబంధించిన క్లూస్ సేకరించడానికి నిందితులను మరో ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టుకు తాజా రిపోర్ట్ సమర్పించారు.

కేతన్‌ను ప్లాన్డ్‌గా హత్య చేసిన తర్వాత, అతని ఐడెంటిటీని ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎవరూ కూడా ట్రాక్ చేయకుండా చేయడానికి సియా గోయల్.. కేతన్ అగర్వాల్ పాస్‌పోర్ట్‌ను ముక్కలుగా చింపి, ఆ తర్వాత దాన్ని పూర్తిగా తగలబెట్టేసిందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ప్రస్తుతం ఆ కాలిన పాస్‌పోర్ట్ బూడిదతో పాటు, మిగిలిన ఆధారాలను కూడా రికవరీ చేయడానికి నిందితుల సహాయం కావాలని కోరారు. అంతేకాదు, కేతన్‌ అగర్వాల్‌ను కొండపై నుంచి తోసేసిన తర్వాత.. చేతన్ చౌదరి తన బట్టలు మార్చుకుని ఎక్కడికి వెళ్లాడనే విషయాన్ని తాము వారి దగ్గర నుంచి రాబట్టాలని కోర్టుకు తెలిపారు.

అలాగే కేతన్ మర్డర్(Ketan Murder) తర్వాత ఈ ఇద్దరు నిందితులు మొబైల్‌లో మాట్లాడుకున్న సీక్రెట్ కాల్స్ డేటాను డీకోడ్ చేయడానికి తమకు మరింత సమయం పడుతుందని పోలీసులు వివరించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు ..నిందితులకు మరో 5 రోజుల పోలీస్ కస్టడీని మంజూరు చేసింది.

ఈ రోజు కోర్టు విచారణకు ఒక రోజు ముందు అంటే జూన్ 28 వ తేదీన పోలీసులు లోహగడ్ కోట వద్ద సీన్ రీ క్రియేషన్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ రోజంతా సాధారణ టూరిస్టులకు కోటపైకి ఎంట్రీ లేకుండా బంద్ చేశారు.

సియా, చేతన్‌ను స్పాట్‌కు తీసుకెళ్లి.. జూన్ 18న వారు కేతన్‌ను ఎలా తోసేశారనే విషయాన్ని ఒక డమ్మీ బొమ్మ (Human Dummy) సహాయంతో సీన్ రీ-క్రియేట్ చేసి చూశారు. గాలి తీవ్రత ఎంత ఉందనే వివరాలతో పాటు, ఏ యాంగిల్‌లో తోస్తే మనిషి 400 అడుగుల కిందకు పడతాడనే టెక్నికల్ క్లూలను పోలీసులు సేకరించారు.

నిజానికి కేతన్‌ను జూన్ 18న హత్య చేయడమనేది వారి ఫస్ట్ ప్లాన్ కాదు. అంతకుముందే మే 31న కేతన్‌ను సియా ఫస్ట్ టైమ్ కోటపైకి తీసుకెళ్లింది. ఆ తర్వాత జూన్ 4న మళ్లీ వెళ్దామని ఎంత అడిగినా దానికి ఆరోజు కేతన్ తల్లి ఒప్పుకోకపోవడంతో ఆ ప్లాన్ ఫెయిల్ అయింది.

Ketan Murder
Ketan Murder

అయితే మళ్లీ ఎలాగోలా కేతన్‌ను ఒప్పించి జూన్ 14న మళ్లీ కోటపైకి తీసుకెళ్లిన సియా.. అక్కడ అతడిని కొండపై నుంచి తోసేయడానికి గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఆరోజు కేతన్ కింద పడుతూ ఒక చిన్న పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.

పైకి వచ్చిన కేతన్ నన్ను ఎందుకు నెట్టేసావని సియాను అడిగితే.. అక్కడ పాము కనిపించింది, నిన్ను కాపాడబోయి పొరపాటున చేయి తగిలిందంటూ కన్నీళ్లతో కన్విన్స్ చేసేసింది. . ఆ తర్వాత జూన్ 18న మూడోసారి పక్కా స్కెచ్‌తో లవర్‌ చేతన్‌ సాయంతో కేతన్‌ను చంపి ప్లాన్‌ను అమలు చేసింది.

Ketan : పూణే మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. క్రూయల్ మైండ్‌తో పక్కా క్రైమ్ స్కెచ్ అంత దారుణమా?

Related Articles

Back to top button