West Bengal : పొలిటికల్ గేమ్ షురూ…బెంగాల్ లో బదిలీలు మొదలు

West Bengal : దేశరాజకీయాల్లో పశ్చిమ్ బెంగాల్ ది ప్రత్యేక స్థానం.. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేద్దామని ప్రయత్నిస్తున్నా జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లకు కుదరడం లేదు

West Bengal

దేశరాజకీయాల్లో పశ్చిమ్ బెంగాల్(West Bengal) ది ప్రత్యేక స్థానం.. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేద్దామని ప్రయత్నిస్తున్నా జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లకు కుదరడం లేదు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీనే ఇక్కడ హవా కొనసాగిస్తున్నారు. పైగా బీజేపీతో మమతా బెనర్జీకి అస్సలు పడదు.

ఢీ అంటే ఢీ అనడమే కాదు కేంద్రాన్ని ఏమాత్రం లెక్క చేయని తత్వం ఆమెది. అలాంటి పశ్చిమ్ బెంగాల్(West Bengal) లో ఇప్పుడు పొలిటికల్ హీట్ మొదలైంది. ఎన్నికల్ షెడ్యూల్ విడుదలైన కొద్ది గంటల్లోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసీ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ మమతా బెనర్జీకి షాక్ మీద షాక్ ఇస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి హింసకు తావులేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

దీనిలో భాగంగా పాలనా యంత్రాంగంలో భారీ ప్రక్షాళణకు శ్రీకారం చుట్టింది. ఎలాంటి వివాదాలు తలెత్తకూడదన్న ఉద్దేశంతో కీలక అధికారులను బదిలీ చేస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో వివాదాలకు చిరునామాగా నిలిచిన పౌర, పోలీసు యంత్రాంగంపై ఈసీ దృష్టి పెట్టింది. సివిల్, పోలీస్ విభాగాలకు సంబంధించి కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై బదిలీ వేటు వేసింది. సీఎస్ నందినీ చక్రవర్తి స్థానంలో దుష్యంత్ నారియాలాను, హోం సెక్రటరీ జగదీశ్ ప్రసాద్ మీనా స్థానంలో నంఘమిత్ర ఘోష్ కు బాధ్యతలు అప్పగించింది.

అలాగే డీజీపీ పియూష్ పాండేను కూడా తప్పించింది. జనవరిలో బాధ్యతలు చేపట్టిన పియూష్ పాండేను పక్కనబెట్టి సిద్ధనాథ్ గుప్తాను డీజీపీగా నియమించింది. అదే సమయంలో కోల్ కత్తా సీపీగా అజయ్ నంద్‌ను, లా అండ్ ఆర్డర్ ఏడీజీగా అజయ్ ముకుంద్ రనడేకు బాధ్యతలు అప్పగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

West Bengal

కీలక అధికారులపైనే బదిలీ వేటు వేయడానికి కారణం వారందరికీ అధికార పార్టీ నేతలతో ఉన్న సాన్నిహిత్యమే కారణమని సమాచారం. గతంలో ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు చేసినప్పుడు సీఎం మమతా బెనర్జీతో పాటు ఈ ఉన్నతాధికారులు కూడా వెళ్లడం తీవ్ర దుమారాన్ని రేపింది.

అలాగే సీనియర్లను పక్కన పెట్టి 30 మంది జూనియర్లకు కీలక పదవుల్లో ప్రమోషవ్స్ ఇవ్వడం , ఈసీ అధికారుల ఆదేశాలను లెక్కచేయకపోవడం, పైగా వారితోనే ఘర్షణకు దిగడం వంటి పరిణామాలే ప్రస్తుత బదిలీకకు కారణంగా చెప్పొచ్చు. 2016, 2021 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి తీవ్ర పరిస్థితులే నెలకొనగా ఘర్షణలు కూడా జరిగాయి. ఈ సారి హింసకు తావులేకుండా పోలింగ్, కౌంటింగ్ వంటివి ప్రశాంతంగా ముగించాలని ఈసీ భావిస్తోంది.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version