Tirumala:తిరుమల కొండపై ఏఐ టెక్నాలజీ..క్యూలైన్ల రద్దీని అంచనా వేస్తూ వేగంగా దర్శనాలు

Tirumala : గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎంత వీలైతే అంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త ప్రణాళికలతో ముందడుగు వేసింది.

Tirumala

తిరుమల కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆరాటపడే సామాన్య భక్తులకు టీటీడీ ఒక శుభవార్త చెప్పింది. వేసవి సెలవులు కావడంతో ఏడుకొండలపై రోజురోజుకు భక్తుల రద్దీ ఊహించని రేంజ్‌లో పెరిగిపోతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సాధారణ భక్తులకు ఎంత వీలైతే అంత త్వరగా స్వామివారి దర్శనం కల్పించడానికి తిరుమల(Tirumala )తిరుపతి దేవస్థానం సరికొత్త ప్రణాళికలతో ముందడుగు వేసింది.

దీనిలో భాగంగానే ఇటీవల వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసిన టీటీడీ అధికారులు… ఇప్పుడు సామాన్య భక్తుల కోసం మరో చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీని కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు.

సాధారణంగా ప్రతి వారం శ్రీవారికి జరిగే అత్యంత పవిత్రమైన అభిషేక సేవ సమయంలో.. సాధారణ భక్తులకు దర్శనాలు ఉండవు. కానీ ఇకపై ఈ అభిషేక సేవ జరిగే సమయంలో కూడా ఏకంగా 5 వేల మంది సర్వదర్శనం భక్తులను ఆలయంలోకి అనుమతించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ వల్ల రోజుకు మరో 15 వేల మంది సామాన్య భక్తులకు శ్రీవారిని కళ్లారా చూసుకునే భాగ్యం కలగనుంది.

దీంతో పాటు తిరుమలలో భక్తుల రద్దీని, క్యూలైన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి టీటీడీ ఒక అత్యాధునిక ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి గంటకు భక్తుల రాకను అంచనా వేస్తూ, దానికి తగ్గట్టుగా క్యూలైన్లను క్లియర్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ టెక్నాలజీ వల్ల శ్రీవారి దర్శనం మునుపెన్నడూ లేనంత వేగంగా సాగుతోంది.

ఇక తిరుమల లడ్డూ ప్రసాదం, స్వామివారి కైంకర్యాల విషయంలో కూడా భక్తులకు నమ్మకాన్ని పెంచేలా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఒక భారీ నెయ్యి తయారీ కేంద్రాన్ని, అలాగే సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను టీటీడీ నిర్మిస్తోంది. ఈ ప్లాంట్ పనులన్నీ ఇప్పటికే 90 శాతం వరకు పూర్తయిపోయాయి.

Tirumala

అలాగే జూలై నెలాఖరు కల్లా ఈ పనులను కంప్లీట్ చేసి ప్లాంట్‌ను రన్నింగ్‌లోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇక్కడ రోజుకు సుమారు 2 వేల లీటర్ల పాలను ప్రాసెస్ చేసి, వాటిని ఏడుకొండలవాడి సేవలకు ఉపయోగించబోతున్నారు.

మొదటగా ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 80 కిలోల స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయనుండగా, ఆ తర్వాత దశలవారీగా దీని కెపాసిటీని ఏకంగా 10 వేల లీటర్లకు పెంచాలని టీటీడీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ సరికొత్త మార్పుల వల్ల తిరుమల వెళ్లే భక్తులకు మరింత తృప్తి లభించనుంది.

Rajya Sabha :24 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల..ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న 4 సీట్ల భర్తీ వ్యవహారం

Exit mobile version