Nandi:నంది చెవిలో కోరికలు చెబుతున్నారా? ఇలా చెబితే శివయ్య వెంటనే కరుణిస్తాడట..

Nandi: నంది ముందు నిలబడి, మన రెండు చేతులు జోడించి అత్యంత భక్తితో ఓం నమః శివాయ అని కానీ, హర హర మహాదేవ అనే మంత్రాన్ని కానీ కనీసం మూడు సార్లు మనసులో పఠించాలి.

Nandi

శివాలయానికి వెళ్లినప్పుడు ప్రతి శివ భక్తుడు.. శివలింగం ముందు ఉన్న నంది(Nandi )చెవిలో తన మనసులోని మాటను చెప్పడం మనం చూస్తుంటాం. అయితే, ఆ కోరికలు నంది ద్వారా పరమశివుడికి చేరి నెరవేరాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పద్ధతి ఉందని పురాణాలు చెబుతున్నాయి. నందీశ్వరుడు కేవలం శివుని వాహనం మాత్రమే కాదని, ఆయన శివునికి అత్యంత సన్నిహితుడు, శివగణాలకు అధిపతి అని శాస్త్రాలు తెలుపుతున్నాయి.

మన ప్రార్థనలు మహాదేవుడికి చేరడానికి ముందుగా నందీశ్వరుడి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఆలయానికి వెళ్లిన వెంటనే ముందుగా నంది దగ్గరకు వెళ్లి కోరికలు చెప్పకూడదట. మొదట నంది ముందు నిలబడి, మన రెండు చేతులు జోడించి అత్యంత భక్తితో ఓం నమః శివాయ అని కానీ, హర హర మహాదేవ అనే మంత్రాన్ని కానీ కనీసం మూడు సార్లు మనసులో పఠించాలి. ఇలా చేయడం వల్ల అప్పటి వరకూ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి, మనసు ప్రశాంతంగా మారుతుందట.ఆ తర్వాతే నందీశ్వరుడిని స్తుతించాలి.

Nandi

మహాశివుడికి మన కష్టాలన్నీ తెలుసు, కానీ నందీశ్వరుడి ద్వారా విన్నవించుకోవడం అనేది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రార్థనగా శివయ్య అనుకుంటారట. చాలా మంది నందికి ఎదురుగా నిలబడి స్వామిని నంది చూడకుండా అడ్డుగా ఉంటారు. కానీ నందికి, శివలింగానికి మధ్యలో ఎప్పుడూ నిలబడకూడదట. అది కూడా శివలింగాన్ని డైరెక్టుగా కాకుండా పక్క నుంచి వెళ్లి నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించుకున్న తర్వాతే మన మనసులోని కోరికను చెప్పుకోవాలి.

బసవరాజ అని కానీ, నందీశ్వరా పాహిమామ్ అని కానీ వేడుకుంటూ నందీశ్వరుడి ఆశీస్సులు పొందాలి. ఆ తర్వాత మీ కోరికను నంది ఎడమ చెవిలో మాత్రమే చాలా రహస్యంగా చెప్పాలి. ఇలా చెప్పేటప్పుడు మీ కుడి చేతిని నంది చెవికి అడ్డంగా పెట్టుకోవడం ఒక సంప్రదాయంగా వస్తుంది.అలా మీ వ్యక్తిగత సమస్యలు, అప్పుల బాధలు , కెరీర్ పరమైన గ్రోత్ ఇలా ఏ విషయమైనా సరే నమ్మకంతో నందికి నివేదించాలి. ఇలా సరైన పద్ధతిలో నందిని కోరుకోవడం వల్ల మన మొర ఆలకించి శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతాయి. 

Barry Marshall:వైద్య లోకాన్ని గడగడలాడించిన డాక్టర్ సాహసం.. నోబెల్ విజేత బారీ మార్షల్ వీరగాథ మీకు తెలుసా?

Exit mobile version