Mitchell Santner : కివీస్ గడ్డపై 3-1 తేడాతో వన్డే సిరీస్‌ భారత్ కైవసం..అందుకే ఓడిపోయామని ఒప్పుకున్న మిచెల్ సాంట్నర్

Mitchell Santner : న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది.

Mitchell Santner

భారత క్రికెట్ జట్టు మరోసారి విదేశీ గడ్డపైన తన ఆధిపత్యాన్ని ఘనంగా చాటుకుంది. బే ఓవల్ వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఐదో వన్డేలో టీమిండియా అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది. కేవలం 210 రన్స్ స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీమ్‌ను భారత బౌలర్లు కట్టడి చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

స్టార్టింగ్ నుంచి కివీస్ బ్యాటర్లపై ప్రెజర్ పెంచుతూ పోయిన మన బౌలర్లు ప్రత్యర్థికి కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31 పరుగులు) తప్ప మిగిలిన వారంతా ఫెయిలవ్వడంతో కివీస్ జట్టు 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలింగ్ దాడిలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లతో చెలరేగిపోగా, మహ్మద్ సిరాజ్ , అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అలాగే ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, నమన్ ధీర్ తలో వికెట్ దక్కించుకోవడంతో భారత్ 22 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో ఘనంగా కైవసం చేసేసుకుంది.

ఇక దీనికంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ ఏమీ ఆశించినంతగా సాగలేదు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5) మరోసారి డిజప్పాయింట్ చేయడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

రుతురాజ్ గైక్వాడ్ (18), శ్రేయస్ అయ్యర్ (22), నమన్ ధీర్ (22) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ సమయంలో అక్షర్ పటేల్ (46) , ఇషాన్ కిషన్ (46) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమ్‌ను ఆదుకున్నారు.

చివర్లో మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ చెరో 14 పరుగులు జోడించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 209 పరుగుల స్కోర్‌ను సాధించగలిగింది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, మిచెల్ శాంట్నర్ మూడేసి వికెట్లను తీసి గట్టి పోటీనిచ్చినా, కూడా చివరికి మన బౌలర్ల సమిష్టి కృషితో భారత్ గెలుపు తలుపు తట్టింది.

భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో ఓటమి పాలైన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్..తాము ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఓపెన్‌గానే మాట్లాడేశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను కేవలం 209 రన్స్‌కే కట్టడి చేయడంపై తమ బౌలర్లు అదరగొట్టారని ప్రశంసించిన సాంట్నర్.. టార్గెట్ ఛేజింగ్‌లో మాత్రం తాము అంచనాలు తలకిందులై ఫుల్‌ టెన్షన్‌లో కూరుకుపోయామని ఒప్పుకున్నారు.

టీమిండియా బౌలర్లు పక్కా వ్యూహాలతో అటాక్ చేయడం, సరిగ్గా అదును చూసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రొటేట్ చేసిన బౌలింగ్ చేంజేస్.. మ్యాచ్‌ను పూర్తిగా తమ చేతుల్లో నుంచి లాగేసుకున్నాయని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చారు.

పిచ్‌పై బాల్ ఎటూ తిరుగుతుందో అంతుచిక్కని విధంగా టర్న్ అవుతూ బ్యాటింగ్‌ను హార్డ్ చేసిందన్న మిచెల్..ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో తేడా క్లియర్‌గా కనిపించినా, పిచ్‌లో రెండు జట్ల మధ్య జరిగిన పోరు మాత్రం కేవలం స్కోర్‌బోర్డు చెప్పినంత ఈజీగా ఏమాత్రం జరగలేదన్నారు. వర్షం వల్ల అంతరాయం, ప్రతికూల టాస్‌లు తమ కొంపముంచాయని చెప్పిన ఆయన.ఈ సిరీస్ ద్వారా తాము నేర్చుకున్న పాఠాలు మాత్రం చాలానే ఉన్నాయన్నారు.

Office Politics : ఆఫీస్ పాలిటిక్స్.. ఆఫీసులో ఉండే ఆ 4 రకాల మనుషులు మీ దగ్గరా ఉన్నారా?

↑
Exit mobile version