Capricorn
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మకరరాశి(Capricorn)కి అధిపతి నవగ్రహాలలో కర్మఫలదాత, క్రమశిక్షణకు కారకుడైన శని దేవుడు. ఈ రాశి వారు అత్యంత క్రమశిక్షణ, బాధ్యత, ప్రాక్టికల్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు. గాలిలో మేడలు కట్టడం లేదా అదృష్టాన్ని నమ్ముకుని కూర్చోవడం వీరికి అస్సలు నచ్చదు.
కేవలం కష్టపడి, మెట్లు ఎక్కి మాత్రమే జీవితంలో పైకి రావాలనేది వీరి ప్రధాన సిద్ధాంతం. చిన్న వయసులోనే పెద్దవారిలా ఆలోచించడం, గంభీరత్వం వీరి మనస్తత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి. నలుగురిని నవ్విస్తూ అందరినీ కలుపుకొని పోవడం వీరికి అలవాటు. ప్రతీ విషయాన్ని చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించే వీరు, జీవితంలో ఒక బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించడానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.
వీరిలో ఉండే గొప్ప ప్లస్ పాయింట్లు ఏంటంటే అమితమైన ఓపిక, కఠినమైన పట్టుదల , సమాజంలో ఉన్నత స్థానాన్ని అందుకోవాలనే బలమైన ఆశయం. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే చాలా ఓపికతో భరిస్తూ ముందుకు సాగుతారే తప్ప మధ్యలోనే పట్టు వదలరు. బాధ్యతలను నెరవేర్చడంలో వీరికి వీరే సాటి. నమ్మదగిన వ్యక్తులుగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆర్థిక విషయాలలో చాలా పొదుపుగా ఉంటూ, భవిష్యత్తును ఎంతో చక్కగా ప్లాన్ చేసుకోగల సామర్థ్యం వీరి సొంతం.
అయితే వీరిలో ఉండే అతి పెద్ద మైనస్ పాయింట్లు నెగెటివ్ ఆలోచనలు, ప్రతీ చిన్న దానికి ఎక్కువగా వర్రీ అవ్వడం, పైకి చాలా కఠినంగా, కోపంగా కనిపించడం. పరిస్థితులు కాస్త అటు ఇటూ అయినా తీవ్రమైన నిరాశకు లోనవుతుంటారు. అలాగే బంధాల కంటే తమ కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ యాంత్రికంగా మారిపోతుంటారు. తమ మనసులోని భావాలను అంత ఈజీగా బయటపెట్టరు, దీనివల్ల కుటుంబ సభ్యులు వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేక దూరం జరిగే ప్రమాదం ఉంటుంది. క్షమించే గుణం కూడా వీరిలో కాస్త తక్కువగానే ఉంటుంది.
ఈ రాశి వారికి కలిసివచ్చే అదృష్ట విషయాల విషయానికి వస్తే, వీరికి అధిపతి శని దేవుడు కావడం వల్ల బ్లాక్, డార్క్ బ్లూ రంగులు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యాపార పనులకు లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు ముదురు నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి.
మకరరాశి(Capricorn) వారికి 8 సంఖ్య అత్యంత అదృష్టాన్ని ఇస్తుంది, అలాగే 8 నెంబర్ కూడిక వచ్చే తేదీలు వీరికి బాగా కలిసివస్తాయి. ఈ రాశి వారు ప్రతి శనివారం శని దేవుడిని లేదా కాలభైరవుడిని, పరమశివుడిని ఆరాధించడం చాలా మంచిది. ప్రతి శనివారం శివాలయంలో లేదా శని దేవుని సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల వీరిలోని నెగెటివ్ ఆలోచనలు, కష్టాలన్నీ తొలగిపోయి అద్భుతమైన విజయం లభిస్తుంది.
Sagittarius : నిజాయితీ, మొహమాటం లేని మాటలు..ధనస్సురాశి మైండ్ సెట్ ఇదే
