Amarnath Yatra
హిమాలయాల్లో వెలిసిన పరమశివుడి పవిత్ర క్షేత్రం అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra) శరవేగంగా సాగుతోంది. బాబా బర్ఫానీని కళ్లారా చూసుకోవడం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది యాత్ర షురూ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.60 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహను సందర్శించి పునీతులయ్యారు.
యాత్ర ప్రశాంతంగా సాగుతున్న సమయంలో తాజాగా జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 8,796 మంది యాత్రికులతో కూడిన తొమ్మిదో బ్యాచ్ కశ్మీర్ లోయ వైపు బయలుదేరింది. మొత్తం 354 వెహికల్స్‌లో కదిలిన ఈ కాన్వాయ్‌లో 3వేల3వందల50 మంది బల్తాల్ రూట్ వైపు, మరో 5వేల3వందల46 మంది సాంప్రదాయ పహల్గామ్ రూట్ వైపు కఠిన భద్రతల నడుమ ప్రయాణమయ్యారు.
శ్రీనగర్ శివార్లలోని పంథా చౌక్ క్యాంపును తాజాగా జమ్మూకశ్మీర్ ఎల్‌జీ మనోజ్ సిన్హా… విజిట్ చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.. ఇది స్థానిక టూరిజం, ఎకానమీకి బూస్టింగ్ ఇస్తుందని ఆయన అన్నారు. యాత్రకు(Amarnath Yatra) వచ్చేవారు ఇక్కడి లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి స్థానిక కళాకారులను ఎంకరేజ్ చేయాలని, ఇది కేంద్ర ప్రభుత్వ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్ఫూర్తిని పెంచుతుందని మనోజ్ సిన్హా కోరారు.
అయితే ఇదే సమయంలో అమాయక భక్తులను టార్గెట్ చేస్తూ నకిలీ రిజిస్ట్రేషన్లతో మనీ కొల్లగొడుతున్న ఒక పెద్ద మోసం వెలుగుచూసింది. గందర్‌బల్ జిల్లాలోని మణిగామ్ క్యాంపులో ఈ దందాకు పాల్పడిన లోకల్ గవర్నమెంట్ టీచర్లు అయిన నలుగురిని అధికారులు సస్పెండ్ చేసి, అరెస్ట్ చేశారు. ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మనోజ్ సిన్హా అధికారులను ఆదేశిస్తూ, అన్ని క్యాంపుల వద్ద నిఘాను పెంచారు.
జూలై 3న ప్రారంభమైన ఈ పవిత్ర యాత్ర మొత్తం 56 రోజుల పాటు సాగి, శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ పండుగ రోజు అంటే ఆగస్టు 28న ముగుస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 3వేల880 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పవిత్ర గుహను చేరుకోవడానికి భక్తులు కఠినమైన పహల్గామ్ లేదా కాస్త తక్కువ దూరముండే బల్తాల్ మార్గాల ద్వారా ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తారు.
ఇక హిమాలయాల వంటి సున్నితమైన వాతావరణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్యం పెరగడం నిజంగానే ఒక పెద్ద సవాలే. దీనిని అరికట్టడానికి జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మరియు శ్రైన్ బోర్డ్ ఈసారి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. యాత్రా(Amarnath Yatra) మార్గంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా బ్యాన్ చేసి.. కేవలం బయో-డిగ్రేడబుల్ కవర్లను మాత్రమే అనుమతిస్తున్నారు.
అలాగే యాత్రా మార్గాల్లో ఎక్కడికక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసారు. ప్రత్యేక సిబ్బందితో ప్రతిరోజూ టన్నుల కొద్దీ పేరుకుపోయే వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. నదులు, వాగులు కలుషితం కాకుండా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. యాత్రికులు ప్రకృతిని పాడు చేయకుండా అవేర్నెస్ కలిగించే సైన్ బోర్డులు, వాలంటీర్ల ద్వారా నిత్యం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Mega 158 : కుమ్మేసిన మెగాస్టార్.. డూప్ లేకుండా 12 గంటల పాటు వానలో ఊచకోత
