Mega 158 : కుమ్మేసిన మెగాస్టార్.. డూప్ లేకుండా 12 గంటల పాటు వానలో ఊచకోత

Mega 158 : వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని, వెండితెరపై తను అనుకుంటే ఊచకోత కోయడం గ్యారెంటీ అని చిరు మరోసారి ప్రూవ్ చేశారు. ‘మెగా 158’ సెట్స్ నుంచి ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Mega 158

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దశాబ్దాలుగా రికార్డుల వేట కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలోకి ఎంతమంది యంగ్ హీరోలు వస్తున్నా, తన వింటేజ్ గ్రేస్ అండ్ మాస్ ఎనర్జీతో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్న చిరు వారందరికీ ఎప్పటికీ రోల్ మోడల్‌గానే ఉంటారు.

వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమేనని, వెండితెరపై తను అనుకుంటే ఊచకోత కోయడం గ్యారెంటీ అని చిరు మరోసారి ప్రూవ్ చేశారు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘మెగా 158’(Mega 158) సెట్స్ నుంచి ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మోస్ట్ ఎక్స్‌ప్లోజివ్ సెకండ్ షెడ్యూల్.. హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో స్పీడ్‌గా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. సినిమాలోనే వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్‌గా నిలిచే ఈ హార్డ్ ‘రెయిన్ యాక్షన్ సీక్వెన్స్’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 12 గంటల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొన్నారు.

సాధారణంగా ఈ ఏజ్‌లో రిస్కీ స్టంట్స్ అంటే డూప్‌లనే వాడుతుంటారు. కానీ చిరు మాత్రం ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదనే ఆలోచనతో కుండపోత వర్షంలో తడుస్తూ, వణికించే చలిని కూడా లెక్కచేయకుండా , ఫైట్స్ చేసి సెట్స్‌లో ఉన్నవారందరికీ తన స్టామినాను తెలియజేశారు.

షూటింగ్ స్పాట్‌లో చిరంజీవి చూపించిన ఈ డెడికేషన్ చూసి డైరెక్టర్ బాబీతో పాటు మొత్తం మూవీ టీమ్ అవాక్కయింది. అసలు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి హెవీ వర్కవుట్స్‌తో రోజును స్టార్ట్ చేసే చిరు లైఫ్‌స్టైల్, వర్క్ ఎథిక్స్ నేటి తరం హీరోలకు ఒక పెద్ద గైడ్ వంటివని మేకర్స్ కితాబిచ్చారు.

Mega 158

ఒక్క లంచ్ బ్రేక్ మినహా, ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా వర్షంలో తడుస్తూ అంత హెవీ యాక్షన్ సీన్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే ఆయన ఎప్పటికీ ఎవరికీ అందనంత ఎత్తులో మెగాస్టార్‌గా నిలిచారంటూ టీమ్ మెంబర్స్ ఎమోషనల్ అయ్యారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ.. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ మూవీలో నివేద పేతురాజ్, అనశ్వర రాజన్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ ఈ మూవీకి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తుండగా, జైలర్ ఫేమ్ విజయ్ కార్తిక్ కన్నన్ విజువల్స్ అందిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత రాబోతున్న ఈ మూవీ థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం క్రియేట్ చేయనుందో చూడాలని మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు.

Cigarette : సిగరెట్లకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా? నిపుణులు చెప్పే ఈ సలహాలు పాటించండి..

Exit mobile version