Dhanteras
ధనత్రయోదశి అనగానే చాలామందికి బంగారం, వెండి , పెద్ద పెద్ద ఇత్తడి పాత్రల కొనుగోళ్లు గుర్తుకువస్తాయి. అయితే మన సనాతన సంప్రదాయంలో, పండితులు చెప్పే పద్ధతులను ఒకసారి చూస్తే.. బంగారం కంటే అత్యంత పవర్ఫుల్గా భావించే వస్తువులు ఇంకా వేరే ఉన్నాయి.
ఎందుకంటే ప్రతీ ఒక్కరూ వేలు, లక్షల రూపాయలు పెట్టి బంగారం కొనలేరు. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందే విషయంలో మాత్రం పేద, గొప్ప అనే తేడా ఉండకూడదని వేద పండితులు చెబుతారు. అందుకే ధనత్రయోదశి రోజు బంగారం,వెండి వంటివి ఏమీ కొనలేకపోయినా కనీసం చీపురు, రాళ్ల ఉప్పు , ధనియాలు కొంటే చాలని ఆ సంవత్సరం మొత్తం ఇంట్లో సిరుల పంట పండుతుందని అంటారు.
మన ఇంట్లోని దరిద్రాన్ని చెత్త రూపంలో ఊడ్చేసే చీపురును శాస్త్రం ప్రకారం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ధనత్రయోదశి(Dhanteras) రోజు కొత్త చీపురును కొని తెచ్చి పూజించడం వల్ల ఆ ఇంట్లోని ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ , జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటకు వెళ్లిపోతాయని నమ్ముతారు. ధన్ తేరస్ రోజు ఈ కొత్త చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తే, ఇంట్లోని ప్రతి మూలా సానుకూల వాతావరణం నెలకొంటుందని పండితులు చెబుతారు.
లక్ష్మీదేవికి తోడబుట్టిన సముద్రపు ఉప్పు (కళ్లు ఉప్పు).. క్షీరసాగర మథనంలో సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్లుగా మన పురాణాలు చెబుతాయి. అందుకే సముద్రంలో పుట్టిన ఉప్పు కూడా లక్ష్మీదేవికి సోదరి వంటిదని భావిస్తారు. అందుకే ధనత్రయోదశి రోజు బజారు నుంచి అయొడైజ్డ్ సాల్ట్ కాకుండా కళ్లు ఉప్పును కొని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు కొన్న ఉప్పును కొద్దిగా గాజు పాత్రలో వేసి లక్ష్మీదేవి పూజలో ఉంచడం వల్ల ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు, దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయని నమ్మకం.
ఐశ్వర్యానికి ప్రాతినిధ్యం వహించే ధనియాల గురించి చాలామందికి తెలీదు. సంస్కృతంలో ధనియాలను ధన అని పిలుస్తారు, అంటే ధనానికి ప్రతిరూపం అని అర్థం. ధనత్రయోదశి(Dhanteras) రోజు కొత్త ధనియాలు కొని తీసుకుని వచ్చి లక్ష్మీ పూజలో లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత కొద్దిగా దనియాలను డబ్బులు దాచే బీరువా లేదంటే లాకర్లో ఒక పసుపు గుడ్డలో కట్టి ఉంచుతారు. మిగిలిన ధనియాలను తోటలో లేదా కుండీల్లో నాటుతారు. ఆ ధనియాలు ఎంత పచ్చగా, ఎంత వేగంగా మొలకెత్తి పెరుగుతాయో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం, ధనాభివృద్ధి అంతే వేగంగా పెరుగుతాయని నమ్ముతారు.
What Women Want In A Man : మీలో ఈ లక్షణాలున్నాయా? అయితే మిమ్మల్ని ఏ అమ్మాయి కూడా వదులుకోదు..
