Bigg Boss Top Contestants : టాప్ 5 రేసులో ఎవరెవరు ఉంటారు?త్రిగుణ్‌కు టఫ్ ఫైట్ ఇస్తున్న ఆ ఒక్కడు..

Bigg Boss Top Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆదివారం రోజు డబుల్ ఎలిమినేషన్‌లో.. రోహిత్ ఎలిమినేట్ అయ్యాక టాప్ 5 అండ్ విన్నర్ రేస్ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. త్రిగుణ్ వర్సెస్ ముకేష్ మధ్య జరుగుతున్న అసలు పోరు జరుగుతోంది.

Bigg Boss Top Contestants

బిగ్ బాస్ తెలుగు 10 వ సీజన్ ఇప్పుడు ఎవరూ ఊహించని మలుపులతో సరికొత్త హైప్‌ను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఆట రసవత్తరంగా సాగుతున్న ఈ కీలక సమయంలో సండే హౌస్‌లో డబుల్ షాక్ తగిలింది. ఇంటి సభ్యుల మాట ఎలా ఉన్నా.. ఆడియన్స్ అంతా కళ్లు మూసుకుని మరీ టాప్ 5 లో (Bigg Boss Top Contestants)ఉంటాడని గట్టిగా నమ్మిన రోహిత్.. తన చేతులతో తానే ఆ అవకాశాన్ని ఎలా పాడుచేసుకున్నాడో అందరం చూశాం.

హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ వందల సార్లు హెచ్చరించినా, తోటి కంటెస్టెంట్స్ ఎంతగా వారించినా లెక్క చేయకుండా తనకు నచ్చినట్లే ప్రవర్తించడం, షాలిని బిగ్ హౌస్ నుంచి వెళ్లిపోయాక గేమ్‌పై పూర్తిగా ఫోకస్ చేయలేకపోవడం రోహిత్ కొంపముంచింది.

చివరకు హౌస్‌మేట్స్ వేసిన ఓట్ల దెబ్బకు రోహిత్ ఈ ఎపిసోడ్‌లో ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. కామనర్స్‌లో గట్టిగా ఫైట్ ఇస్తాడనుకున్న రోహిత్ అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఈ 10 వ సీజన్ విన్నర్ రేస్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తుందనే డిస్కషన్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కాగా ఇప్పుడున్న సిచ్యువేషన్‌ను బట్టి అంచనా వేస్తే.. టాప్ 5 రేసులో త్రిగుణ్, ముకేష్, దేబ్జానీ, అమన్ పక్కాగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే సోషల్ మీడియాలో ఫిక్స్ చేశారు. ఇక కామనర్ కోటా నుంచి ఒకరిని ఫినాలే వరకు తీసుకెళ్లాలన్న లెక్కలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి అమన్ అక్కడ సెట్ అయిపోతాడు.

ఐదో స్థానం కోసం మాత్రం నరేష్ , రామ్‌ప్రసాద్ మధ్య తెలీకుండానే గట్టి పోటీ నడుస్తోంది. అయితే ఆడియన్స్ ఓటింగ్ ట్రెండ్స్ బట్టి ఈ ఇద్దరిలో ఒకరు వచ్చే 2 వారాలలో బయటికి వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ త్రిగుణ్‌కు సింగిల్ హ్యాండ్‌తో ఓ రేంజ్‌లో గట్టి పోటీ ఇచ్చిన రోహిత్ వెళ్లిపోవడంతో, ఇప్పుడు ఆ ప్లేస్‌ను ముకేష్ భర్తీ చేస్తున్నాడు.

స్టార్టింగ్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా, కొద్ది వారాలుగా ముకేష్ అగ్రెషన్ లెవెల్స్ వేరే లెవెల్‌లో ఉంటున్నాయి. రోహిత్ కూడా లాస్ట్ రెండు వారాలలో ముకేష్ టీమ్‌తో కలిసి ఆడటాన్ని బట్టి చూస్తే, రాబోయే రోజుల్లో హౌస్‌లో ముకేష్ వర్సెస్ త్రిగుణ్ మధ్య నడిచే బిగ్ బాస్ వార్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.

అయితే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్‌ను తన వేళ్ల మీద ఆడిస్తున్న త్రిగుణ్ జోరు ముందు మాత్రం ఎవరూ నిలవలేకపోతున్నారన్నది మాత్రం అంతా ఒప్పుకుంటున్నారు. కేవలం ఫిజికల్ టాస్కుల్లో ఆడటమే కాదు, మైండ్ గేమ్‌తో కూడా అవతలి వాళ్లను ఎలా మానిప్యులేట్ చేయాలో త్రిగుణ్‌కు తెలిసినంత బాగా వేరేవారికి తెలియడం లేదు. ఎవరిని ఎలా వాడుకోవాలో పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో కదులుతూ పక్కాగా ఆడుతున్నాడు.

 

కొన్ని ఎపిసోడ్స్‌లో త్రిగుణ్ చేసిన మానిప్యులేషన్‌ స్కెచ్‌కు హౌస్‌లోని తోటి కంటెస్టెంట్స్‌తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా నోరెళ్లబెట్టారు. గేమ్‌ను క్షణాల్లో తన వైపునకు తిప్పుకోగల కెపాసిటీ త్రిగుణ్‌కు బాగా ఉందని జనాలు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈసారి టైటిల్ కప్పును త్రిగుణ్‌ ఎగరేసుకుపోతాడని అందరూ భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ అందరూ ఊహించినట్లు(Bigg Boss Top Contestants) ఉండదు కాబట్టి, లాస్ట్ మినిట్‌లో జరిగే చిన్నపాటి ట్విస్టులు ఎవరి తలరాతను మారుస్తాయో చూడాలి.

Dhanteras : ధనత్రయోదశి రోజు బంగారమే కొనక్కరలేదు..చీపురు, ఉప్పు, ధనియాలు కొన్నా సరిపోతుందట

↑
Exit mobile version