Betel Leaf
హిందూ సంస్కృతిలో తమలపాకు (Betel Leaf)కేవలం ఒక ఆకు మాత్రమే కాదు. అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ నాగవల్లి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల.. ఎనలేని అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతుంటారు. అయితే, ఈ మొక్కను పెంచే విషయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించకపోతే మాత్రం ఐశ్వర్యం కలిగే మాటేమో కానీ అశుభాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇంట్లో నాగవల్లి మొక్కను పెంచడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా ఈ తీగల్లో ఆంజనేయ స్వామి కొలువై ఉంటారని భక్తులు నమ్ముతారు. ఆంజనేయుడికి కూడా తమలపాకులంటే మక్కువ కాబట్టే తమలపాకుల మాలతో భక్తులు ఆయనను వేడుకుంటారు.
అలాగే నాగదోషాలతో బాధపడేవారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ తమలపాకుపై శ్రీరామ అని గంధంతో కానీ పసుపుతో కాని రాసి స్వామివారికి పూజ చేస్తే ధైర్యసాహసాలతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. ఇంట్లో ఈ మొక్క ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ నశించి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెబుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం చూస్తే తమలపాకు మొక్కను ఉంచే దిశ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. సాధారణంగా ఈశాన్య మూలలో తులసి మొక్క తప్ప మిగిలిన ఏ మొక్కలు కూడా పెంచరు. ఇలా మొక్కలు పెంచడం మంచిది కాదని చెబుతారు.
అందుకే తమలపాకు(Betel Leaf) తీగను దక్షిణ దిశలో పెంచుకోవడం అత్యంత శుభప్రదంగా వాస్తు నిపుణులు చెబుతున్నారు. రావి, వేప చెట్ల వలె తమలపాకుకు కూడా శక్తివంతమైన ఆధ్యాత్మిక లక్షణాలున్నాయని గ్రంథాలు పేర్కొంటున్నాయి.
ఆరోగ్యపరంగా చూసినా కూడా తమలపాకు ఒక శక్తివంతమైన ఔషధం. దీనిలో విటమిన్ ఎ, సి , కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శ్వాసకోశ ఇబ్బందులున్నప్పుడు తమలపాకుకు ఆయిల్ రాసి వేడి చేసి ఛాతీపై ఉంచితే రిలీఫ్ లభిస్తుంది. అలాగే బాలింతలలో ఒక్కోసారి పాలు గడ్డకట్టి నొప్పిగా ఉన్నప్పుడు.. ఆముదం రాసిన తమలపాకును ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఈ పవిత్రమైన మొక్కను తులసి కోటలాగే ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. మొక్క పాదు చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. వేడి, సూర్యరశ్మి తగిలే ప్లేస్‌లో ఇది బాగా పెరుగుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆకులు కోయడం వంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు. 20 రోజులకు ఒకసారి అయినా సేంద్రీయ ఎరువులు వేస్తూ, తెగుళ్లు రాకుండా వేపనూనెతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.
Gond Kathira :గోంద్ కతీరా పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ సమ్మర్‌లో అస్సలు లైట్ తీసుకోకండి..
