HealthLatest News

Gond Kathira :గోంద్‌ కతీరా పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ సమ్మర్‌లో అస్సలు లైట్ తీసుకోకండి..

Gond Kathira : కేవలం చలువ చేయడమే కాకుండా రక్త శుద్ధికి , మూత్రంలో మంట వంటి సమస్యలకు కూడా గోంద్‌ కతీరా ఒక మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Gond Kathira

సమ్మర్ వచ్చిందంటే చాలు బాడీలో వేడి పెరగడంతో.. దానివల్ల నీరసం, మలబద్ధకం , వడదెబ్బ వంటి సమస్యలు వస్తుంటాయి. వీటన్నింటికీ ఒకే ఒక అద్భుతమైన, సహజసిద్ధమైన పరిష్కారం గోంద్‌ కతీరా అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

గోంద్‌ కతీరా(Gond Kathira) అనేది ఒక చెట్టు నుంచి లభించే నేచురల్ జిగురు. చూడటానికి రాయిలా గట్టిగా ఉండే గోంద్‌ కతీరా నీటిలో నానబెట్టగానే అది జెల్లీ లాగా మారుతుంది. బాడీ టెంపరేచర్‌ను అదుపులో ఉంచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా సమ్మర్‌లో వచ్చే అతి వేడిని తగ్గించడంతో పాటు బాడీని లోపలి నుంచి చల్లబరుస్తుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది.

ఎండ తీవ్రత వల్ల కలిగే నీరసాన్ని గోంద్‌ కతీరా వెంటనే తగ్గిస్తుంది. కేవలం చలువ చేయడమే కాకుండా రక్త శుద్ధికి , మూత్రంలో మంట వంటి సమస్యలకు కూడా గోంద్‌ కతీరా ఒక మంచి మెడిసిన్‌గా పనిచేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటుగా, మొటిమల సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

Gond Kathira
Gond Kathira

దీనిని రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. రాత్రిపూట కొంచెం గోంద్‌ కతీరాను వాటర్‌లో నానబెడితే, ఉదయానికి అది మంచు గడ్డలాంటి మెత్తని జెల్లీగా తయారవుతుంది. ఆ జెల్లీని చల్లటి పాలలో కానీ నీటిలో కానీ కలుపుకొని, కొంచెం పటిక బెల్లం వేసుకుని తాగితే బాడీకి మేలు చేస్తుంది. దీనిని నిమ్మరసం , నన్నారి షర్బత్ వంటి వాటిలో కలుపుకొని కూడా ఆస్వాదించవచ్చు.

అయితే గోంద్‌ కతీరా((Gond Kathira) )ను ఉపయోగించేటప్పుడు కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని ఎప్పుడూ వేడి చేయకూడదు, కేవలం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇది తీసుకున్న రోజు శరీరానికి సరిపడా నీటిని తాగడమనేది చాలా ముఖ్యం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్కెట్లో సాధారణంగా దొరికే గోంద్‌ వేడిని కలిగిస్తుంది, కాబట్టి కొనేటప్పుడు అది కల్తీ కాని గోంద్‌ కతీరా అని నిర్ధారించుకుని తీసుకోవడం మంచిది.

IPL Final : అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్..బెంగళూరుకు బీసీసీఐ షాక్

Related Articles

Back to top button