Leo : రాజులాంటి మనస్తత్వం.. సింహరాశి వారికి ఉన్న పెద్ద మైనస్ ఏంటి?

Leo : ఈ రాశి వారికి కలిసివచ్చే అదృష్ట విషయాల విషయానికి వస్తే, వీరికి అధిపతి సూర్యుడు కావడం వల్ల గోల్డ్, ఎల్లో, ఆరెంజ్ రంగులు అత్యంత అదృష్టాన్ని ఇస్తాయి

Leo

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సింహరాశికి(Leo) అధిపతి నవగ్రహాలకు రాజు, సాక్షాత్ సూర్యభగవానుడు. అందువల్లే ఈ రాశి వారు సహజంగానే రాజులాంటి గంభీరమైన మైండ్ సెట్ కలిగి ఉంటారు. వేదిక ఏదైనా, స్థలం ఏదైనా సరే.. అక్కడ తామే హైలైట్ అవ్వాలని, అందరి దృష్టి తమపైనే ఉండాలని, అందరూ తమ మాట వినాలనే కోరిక వీరిలో చాలా బలంగా ఉంటుంది.

ప్రతీ చోటా లీడర్‌గా వ్యవహరించడం వీరి పుట్టుకతో వచ్చిన నైజం. ఎవరి కిందా లొంగి ఉండటానికి ఇష్టపడని వీరు, తమ ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటూ అందరినీ శాసించాలనే మనస్తత్వం వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది.

వీరిలో ఉండే గొప్ప ప్లస్ పాయింట్లు ఏంటంటే అచంచలమైన ధైర్యం, ఉదార స్వభావం, నలుగురికీ సహాయం చేసే గుణం మరియు అపారమైన ఆత్మవిశ్వాసం. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా నిలబడతారే తప్ప వెనకడుగు వేయరు.

మనసు చాలా పెద్దది కావడం వల్ల, ఎవరైనా సహాయం అని వస్తే తమ శక్తికి మించి సాయం చేస్తారు. నమ్మిన వారి కోసం, తమను ఆశ్రయించిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వీరు వెనకాడరు. సమాజంలో ఎక్కడున్నా సరే తమదైన ముద్ర వేస్తూ, అన్యాయాన్ని ఎదిరిస్తూ ధర్మ పక్షాన నిలబడటానికి ఇష్టపడతారు.

కాని వీరిలో ఉండే అతి పెద్ద మైనస్ పాయింట్లు మితిమీరిన అహంకారం (Ego), పొగడ్తలకు త్వరగా లొంగిపోవడం, విపరీతమైన కోపం. ఎవరైనా తమను తక్కువ చేసి మాట్లాడినా, నిర్లక్ష్యం చేసినా లేదా తమపై ఆధిపత్యం చలాయించాలని చూసినా వీరు అస్సలు భరించలేరు.

అయితే ఎదుటివారు తమను పొగుడుతుంటే చాలా సులభంగా లొంగిపోతారు, దీనివల్ల కొన్నిసార్లు స్వార్థపరుల మాటలు నమ్మి మోసపోతుంటారు. కోపం వస్తే అదుపు చేసుకోవడం వీరికి చాలా కష్టం, ఆ సమయంలో మాట్లాడే మాటల వల్ల మంచి బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Leo

ఈ రాశి వారికి కలిసివచ్చే అదృష్ట విషయాల విషయానికి వస్తే, వీరికి అధిపతి సూర్యుడు కావడం వల్ల గోల్డ్, ఎల్లో, ఆరెంజ్ రంగులు అత్యంత అదృష్టాన్ని ఇస్తాయి. ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల విజయావకాశాలు పెరుగుతాయి.

సింహరాశి(Leo) వారికి 1 సంఖ్య చాలా పవర్‌ఫుల్ అలాగే అదృష్ట సంఖ్య కూడా. ఈ రాశి వారు ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం లేదా గాయత్రీ మంత్రం పఠించడం చాలా మంచిది. అలాగే పరమశివుడిని ఆరాధించడం, శివతాండవ స్తోత్రం చదవడం వల్ల వీరిలోని విపరీతమైన కోపం, ఈగో తగ్గి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి.

Gemini : అద్భుతమైన మాటకారులు.. మిథునరాశి వారి అసలు నైజం ఇదే

Exit mobile version