Natheshwar Nath Mahadev : తాళాల మహాదేవుడు గురించి తెలుసా? ..తాళం వేస్తే కోరికలు నెరవేర్చే భోళాశంకరుడు ఎక్కడున్నాడు?

Natheshwar Nath Mahadev నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే ఎటు చూసినా గోడలు, కంచెలు, చుట్టుపక్కల గ్రిల్స్‌కి వేలాది తాళాలు దర్శనమిస్తుంటాయి.

Natheshwar Nath Mahadev

ఏదైనా ఆలయానికి వెళ్తే దండం పెట్టుకుంటాం, కొబ్బరికాయలు కొడతాం, హుండీలో ముక్కులు చెల్లిస్తాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న.. నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్(Natheshwar Nath Mahadev) ఆలయంలో శివాలయంలో మాత్రం డిఫరెంట్‌గా మొక్కులు చెల్లిస్తారు. అక్కడకు వెళ్తే మాత్రం కచ్చితంగా ఒక తాళం కప్ప వేయాల్సిందే.

శతాబ్దాలుగా సాగుతున్న ఈ ఆచారం ఇప్పుడు భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ గుడిని అందరూ తాళం వేసిన మహాదేవ్ ఆలయమని పిలుచుకుంటారు. అసలు శివుడి గుడిలో తాళాలు వేసే సంప్రదాయం ఏంటి? దీని వెనుక ఉన్న అసలైన విశ్వాసం ఏంటి, తాళం వేస్తే నిజంగానే కోరికలు ఎలా నెరవేరతాయనే విషయాలు చాలామందికి తెలియదు.

ఈ నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్(Natheshwar Nath Mahadev) ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే ఎటు చూసినా గోడలు, కంచెలు, చుట్టుపక్కల గ్రిల్స్‌కి వేలాది తాళాలు దర్శనమిస్తుంటాయి. భక్తులు తమ మనసులోని కోరికను భోళాశంకరుడికి చెప్పుకుని, ఒక తాళాన్ని అక్కడ లాక్ చేసి వెళ్తారు. అలా తాళం వేస్తే ఆ భోళానాథుడు తమ కోరికలను విని వాటిని నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం.

అంతేకాదు అలా తాము అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత భక్తులు మళ్లీ ఈ గుడికి తిరిగొచ్చి, తాము గతంలో వేసిన తాళాన్ని తాళంచెవితో తెరిచి.. శివయ్యకు ప్రత్యేక పూజలు సమర్పిస్తారు. తాము వేసిన తాళాన్ని మళ్లీ వచ్చినపుడు గుర్తుపట్టడం కోసం చాలామంది దానిపై తమ పేరు కానీ, అడ్రస్ కానీ లేదంటే ఏదైనా ఒక స్పెషల్ గుర్తు రాసి మరీ లాక్ చేస్తుంటారు.

అయితే మెల్లమెల్లగా భక్తులు వేసే తాళాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో, స్థలం ఖాళీ చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వడం కోసం పాత తాళాలన్నిటిని జాగ్రత్తగా తొలగించి ఆలయ నిర్వాహకులు ఒక ప్రత్యేక గదిలో భద్రపరుస్తున్నారు.

Natheshwar Nath Mahadev

ఈ నాథేశ్వర్‌నాథ్ మహాదేవ్ ఆలయంలో ప్రతీ రోజూ రుద్రాభిషేకం, జలాభిషేకం, పూజలతో వాతావరణం చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసం, శ్రావణ సోమవారాలు, మహాశివరాత్రి రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలో ఆలయ పరిసరాలన్నీ హర్ హర్ మహాదేవ్, బమ్ బమ్ భోలే అనే నినాదాలతో మారుమోగిపోతాయి.

మొత్తంగా ప్రతి తాళం వెనుక భక్తి, నమ్మకం దాగి ఉన్న ఈ నాథేశ్వర్‌నాథ్ ఆలయం, ప్రయాగ్‌రాజ్ ఆధ్యాత్మిక పర్యాటకంలో ప్రతీ భక్తుడికి ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.

Mangroves : సముద్ర గర్భంలో అద్భుత ప్రపంచం..మడ అడవుల్లో విచిత్ర జీవులు..ప్రకృతి సృష్టించిన వింత కాన్వాస్

Exit mobile version