Just Internationaljust AnalysisLatest News

Mangroves : సముద్ర గర్భంలో అద్భుత ప్రపంచం..మడ అడవుల్లో విచిత్ర జీవులు..ప్రకృతి సృష్టించిన వింత కాన్వాస్

Mangroves : ఫిలిప్పీన్స్‌లో ప్లాస్టిక్ వేస్టేజ్‌లు, ప్లాస్టిక్ కుప్పల మధ్య ఉన్న మడ అడవి దృశ్యం మనల్ని ఆలోచింపజేసేలా ఉంది.

Mangroves

భూమి సరిహద్దులు ముగిసి, సముద్రపు సాల్ట్ వాటర్ స్టార్టయ్యే చోట ఒక రహస్య ప్రపంచం దాగుందన్న విషయం చాలామందికి తెలీదు. మడ అడవులు అంటే మాంగ్రూవ్స్‌లో విచిత్రమైన వరల్డ్‌ను చూడొచ్చు. బయటకు చూస్తే మామూలు చెట్లలాగే కనిపిస్తాయి కానీ, వాటర్ లోపల మాత్రం అనేక రేర్ యానిమల్స్‌కు ఇవి కోటలా ప్రొటెక్షన్ ఇస్తుంటాయి.

మరికొన్ని క్రూర జంతువులకు అయితే సీక్రెట్ వేటాడే గ్రౌండ్స్‌లా మారతాయి. అలాంటి అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను తమ కెమెరాతో బంధించిన ఫేమస్ ..2026 మాంగ్రూవ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ విజేతల ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఫ్లోరిడా తీరం నుంచి మొదలై ఇండోనేసియా దీవుల వరకు అలాగే సుందర్బన్స్ బెంగాల్ టైగర్ నుంచి స్టార్టయి అరుదైన డాల్ఫిన్ల వరకు కూడా చూపు తిప్పుకోనివ్వని 13 అద్భుతమైన ఫోటోలపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

భారత్‌లోని ముంబయి తీరానికి కాస్త సమీపంలో ఉన్న నంద్ గావ్ అనే విలేజ్లో గౌరవ్ పాటిల్ తీసిన ఫోటో ఈ పోటీలో విజేతగా నిలిచింది. నీటి అడుగున ఒక మడ వృక్షానికి చిక్కుకుని, అతినీలలోహిత (UV) కాంతిలో రాకాసి దెయ్యంలా మెరిసిపోతున్న ఘోస్ట్ నెట్ ..సముద్రంలో వదిలేసిన పాత చేపల నెట్‌ ఫోటో ఆయన బంధించారు.

Mangroves
Mangroves

మనుషులు నిర్లక్ష్యంగా పారేసే ఈ చేపల వలలు చెట్లకు చిక్కుకుని సముద్ర జీవుల ప్రాణాలు ఎలా పోతున్నాయో ఈ ఫోటో క్లియర్‌గా చూపిస్తోంది. అలాగే సుందర్‌బన్స్ ఫా అశోక్ బెహెరా తీసిన మరో ఫోటోలో మడ్‌స్కిప్పర్స్ అనే రెండు కలర్‌ఫుల్‌ చేపలు నోళ్లు తెరిచి పోట్లాడుకుంటూ కనిపించడం నిజంగా వండరే. ఈ విచిత్రమైన చేపలు వాటర్‌లో ఈదడమే కాదు, నేల మీద నడవగలవు, దూకగలవు, నీటి బయట కూడా శ్వాస తీసుకోగలవన్న విషయాలపై నెట్టింట చర్చ సాగుతోంది.

Mangroves
Mangroves

సముద్ర జీవుల తెలివితేటలను చాటిచెప్పే మరికొన్ని ఫోటోలు కూడా నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మార్క్ ఇయాన్ కుక్ అనే ఫోటోగ్రాఫర్ అమెరికాలోని ఫ్లోరిడా బేలో తీసిన ఫోటోలో.. బాటిల్ నోస్ డాల్ఫిన్లు తమ తెలివితో నీటి అడుగున ఉన్న బురదను పైకి లేపి, ఒక సుడిగుండంలాంటి వలయాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ బురదలో చిక్కుకున్న ముల్లెట్ చేపలను చాలా ఈజీగా వేటాడతాయి. అయితే ఈ అరుదైన వేట పద్ధతి కెమెరాకు చిక్కడం చాలా విశేషం.

Mangroves
Mangroves

బహమాస్‌లో ఎవాన్ కూపర్ తీసిన ఫోటోలో ఒక చిన్న గ్రీన్ తాబేలు డేంజరస్‌ అయిన టైగర్ షార్క్ నుంచి తప్పించుకోవడానికి మాంగ్రూవ్ వేర్ల మధ్య దాక్కున్న ఈ దృశ్యం.. అదర్ స్పీసీస్ కేటగిరీలో విజేతగా నిలిచింది. ఫ్లోరిడా బేలోనే లెమన్ షార్క్‌ను ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ వెళ్తున్న అమెరికన్ ఫ్లెమింగో పక్షుల మార్చ్ కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించింది.

Mangroves
Mangroves

ఇవే కాకుండా గాలాపాగోస్ దీవుల్లో నిస్సారమైన వాటర్‌లో పక్షుల్లా రెక్కలు చాచి తేలుతూ వెళ్లే.. గోల్డెన్ రేస్ ఆక్వాటిక్ యానిమల్స్, కరేబియన్ సముద్రంలోని బొనైర్ వద్ద చిన్న చేపల గుంపుపై దాడి చేయబోతున్న స్నూక్ చేప దృశ్యాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి.

Mangroves
Mangroves

సాధారణంగా మాంగ్రూవ్ ఫారెస్ట్‌లు మామూలు అడవుల కంటే 5 రెట్లు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి స్టోర్ చేసుకోగలవు. తీర ప్రాంతంలో వచ్చే తుపాన్లు, భారీ అలల నుంచి 15 కోట్లకు పైగా ప్రజలను ఇవి రక్షిస్తున్నాయి. ఇరాన్‌లో చెట్టు ఆకుల్లో దాక్కున్న ఇండియన్ వైట్ ఐ పక్షి అలాగే భారత్‌లోని దట్టమైన అడవుల్లో రక్షణ పొందుతున్న అడవి పిల్లి పిల్లల ఫోటో ఇండోనేసియాలోని ఒక చెట్టుపై మిలమిలా మెరిసే పాలపుంత నక్షత్రాల వెలుగులు ఇలా ప్రకృతి అందాలకు నిదర్శనంగా నిలిచిన ఫోటోలు ఎన్నో ఉన్నాయి.

Mangroves
Mangroves

అయితే నాణేనికి రెండో వైపులా ఈ అడవులకు మనిషి చేసిన ..చేస్తున్న తప్పుల వల్ల పెద్ద ముప్పు పొంచి ఉందనే చేదు నిజానికి ఈ ఫోటోలు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా ఫిలిప్పీన్స్‌లో ప్లాస్టిక్ వేస్టేజ్‌లు, ప్లాస్టిక్ కుప్పల మధ్య ఉన్న మడ అడవి దృశ్యం మనల్ని ఆలోచింపజేసేలా ఉంది.

Mangroves
Mangroves

చేపల పెంపకం, తీర ప్రాంతాల నిర్మాణాలు, వెదర్‌లో జరిగే మార్పుల వల్ల ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అయినా కూడా గ్లోబల్ మాంగ్రూవ్ వాచ్ లెక్కల ప్రకారం 1985 నుంచి 2025 మధ్య వరల్డ్ వైడ్‌గా మడ అడవుల విస్తీర్ణం సుమారు 477.2 చదరపు కిలోమీటర్లు పెరగడం నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందుకే ఇలాంటి అద్భుతమైన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.

Fish : ఆరోగ్యానికి మంచిదని ఫిష్ తింటున్నారా?..అయితే మీరు తింటుంది చేపలు కాదు..ప్లాస్టిక్ అంటే నమ్ముతారా?

Related Articles

Back to top button