Pooja Room : దేవుడి గదిలో ఈ ఒక్క పొరపాటు చేసినా కష్టాలే..ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి?

Pooja Room : పూజామందిరాన్ని ఈశాన్య మూలన నిర్మించుకోవడమే ఎప్పుడూ మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పెద్ద ఇల్లు అయితే గనుక, ఇంటికి సరిగ్గా మధ్య భాగంలో దేవుడి గది నిర్మిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి.

Pooja Room

ప్రతీరోజు కాసేపు ప్రశాంతంగా దీపం వెలిగించి మనస్సులోని బాధలను దేవుడికి చెప్పుకోవడం హిందువుల ఆచారం. అందుకే ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా, దేవుడి గదిని కేటాయించుకోవడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. అయితే దేవుని మందిరం(Pooja Room) ఏర్పాటు చేసుకునేటప్పుడు మనకు తెలీకుండానే కొన్ని వాస్తు పొరపాట్లు జరుగుతుంటాయి.

అసలు దేవుని మందిరంలో దేవతా మూర్తుల పటాలు ఏ వైపు చూడాలి? పూజా సామాగ్రిని ఎక్కడ పెట్టాలి? దేవుడి గదిలో పొరపాటున కూడా పెట్టకూడని వస్తువులు ఏమిటనే విషయాలు చాలామందికి తెలియవు.

పూజామందిరాన్ని(Pooja Room) ఈశాన్య మూలన నిర్మించుకోవడమే ఎప్పుడూ మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పెద్ద ఇల్లు అయితే గనుక, ఇంటికి సరిగ్గా మధ్య భాగంలో దేవుడి గది నిర్మిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. స్థలం తక్కువగా ఉన్నవారు అయితే కిచెన్‌లోని ఈశాన్య భాగాన్ని దేవుడి స్థలంగా మార్చుకోవచ్చు.

ఈశాన్య భాగంలో పూజ, ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. పల్లెటూరిలో అయితే తెల్లవారుజామున వచ్చే లేలేత భానుడి కిరణాలు ఈ దిశ గుండా ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నవారికి శారీరక ఆరోగ్యం, మంచి శక్తి లభిస్తాయని అనేవారు.

అయితే పడకగదిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఇక దేవుడి విగ్రహాలు లేదా దేవుడి పటాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కులకు అభిముఖంగా ఉంచాలి.

దీనివల్ల ఉదయం తూర్పు ఈశాన్యం, నుంచి అలాగే సాయంత్రం పడమర నుంచి వచ్చే సూర్యకాంతి డైరెక్టుగా విగ్రహాలపై పడి, చూసేవారికి పాజిటివ్ వైబ్స్‌ని ఇస్తుంది. అలాకాకుండా విగ్రహాలను ఉత్తరం ముఖంగా పెడితే, మనం పూజించేటప్పుడు దక్షిణం వైపు చూడాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం దక్షిణం వైపు ముఖం పెట్టి ప్రార్థించకూడదు.

Pooja Room

ఇక మనలో చాలామంది తెలీక దేవుడి గదిలో విరిగిపోయిన విగ్రహాలు, మూలలు విరిగిన లేదా చిరిగిపోయిన, బాగా పాత ఫోటోలను ఉంచి పూజిస్తుంటారు. అలాగే ఒక విగ్రహానికి ఇంకో విగ్రహం సరిగ్గా ఎదురెదురుగా ఉండేలా పెట్టకూడదు. మనం భగవంతుడిని చూడాలి తప్ప, విగ్రహాలు ఒకదానినొకటి చూసుకుంటున్నట్లు ఉంచకూడదు.

పూజకు వాడే నూనె, వత్తులు, కర్పూరం, అగరబత్తీలు వంటివాటితో పాటు ఇత్తడి లేదా వెండి పూజా సామాగ్రిని ఆగ్నేయ మూలలో భద్రపరచాలి. ఈ సామాన్లు మనం కూర్చునేటపుడు గానీ, విగ్రహాల దర్శనానికి గానీ అడ్డుగా ఉండకూడదు.

అలాగే, చాలామంది చనిపోయిన తమ కుటుంబ సభ్యుల ఫోటోలను దేవుడి పటాల పక్కనే పెడుతుంటారు. దేవుడి స్థలంలో పెద్దల ఫోటోలు ఉంటే మన దృష్టి వారిపైకి పోయి పూజపైన ఏకాగ్రత తగ్గుతుంది.

Arunachalam : తెరుచుకున్న అరుణాచల మోక్ష మార్గం.. కానీ భక్తులు ఈ రూల్స్ పాటించాల్సిందే..

Exit mobile version