Dhakshinaamurthi : దక్షిణామూర్తి అంటే ఎవరు? ఈ అవతారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?

Dhakshinaamurthi : అసలు దక్షిణామూర్తి అనే పేరు వెనుక ఉన్న రహస్యాన్ని కనుక గమనిస్తే.. శివుని శరీరంలో ఎడమ భాగం అంటే ఉత్తర భాగం అమ్మవారి స్వరూపమైన పార్వతీదేవి ఉంటుంది

దక్షిణామూర్తి అంటే జ్ఞానానికి, విద్యాబుద్ధులకు అధిపతి అయిన సాక్షాత్ పరమశివుని గురు స్వరూపంగా చెబుతారు . సనాతన ధర్మంలో గురువులకే గురువుగా, సమస్త విద్యలకు మూలకారకుడిగా దక్షిణామూర్తి(Dhakshinaamurthi)ని కొలుస్తారు.

సాధారణంగా ఈ స్వామివారి విగ్రహాన్ని గమనిస్తే.. ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని, ఒక కాలితో అపస్మారక రాక్షసుణ్ణి తొక్కిపట్టి, మరో కాలును పైకి మడిచి ఉంచుతారు. దక్షిణామూర్తి(Dhakshinaamurthi) చుట్టూ మునులు, ఋషులు కూర్చుని ఉంటారు. అసలు ఈ అద్భుతమైన భంగిమ వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం గురించి చాలామందికి తెలీదు.

బ్రహ్మదేవుని మానస పుత్రులు అయిన సనక, సనంద, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించడం కోసం కఠోరమైన తపస్సులు చేశారు. అయినా వారెవ్వరికీ కూడా పరమార్థం బోధపడలేదు. దాంతో వారు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందడం కోసం పరమశివుడిని ఆశ్రయించారు.

అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద మౌన ముద్రలో ఆసీనుడు అవ్వగా ఆయన చుట్టూ ఆ నలుగురు ఋషులు కూర్చున్నారు. విశేషం ఏంటంటే.. మహాశివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం ఆ యోగ భంగిమలోనే ఉండిపోయారు.

అయినా సరే ఆ మౌన వ్యాఖ్యానం వల్లే ఋషుల మనస్సుల్లో ఉన్న అనుమానాలు, ప్రశ్నలు పటాపంచలైపోయి, వారికి పరిపూర్ణ జ్ఞానోదయమైంది.

ఈ పరమ పవిత్రమైన రూపాన్నే మన పురాణాలు దక్షిణామూర్తి(Dhakshinaamurthi)గా అభివర్ణించాయి. నిజమైన జ్ఞానమనేది మాటల ద్వారా వివరించేది కాదని.. అది కేవలం అనుభూతి ద్వారా మాత్రమే పొందగలిగేదని ఈ రూపం తెలియజేస్తుంది. స్మార్త సంప్రదాయంలో గురు పరంపరకు ఆద్యుడిగా దక్షిణామూర్తిని పూజిస్తారు.

అసలు దక్షిణామూర్తి అనే పేరు వెనుక ఉన్న రహస్యాన్ని కనుక గమనిస్తే.. శివుని శరీరంలో ఎడమ భాగం అంటే ఉత్తర భాగం అమ్మవారి స్వరూపమైన పార్వతీదేవి ఉంటుంది. అయితే ఈ రూపంలో అమ్మవారి భాగమేమీ లేకుండా, కేవలం శుద్ధ శివ స్వరూపంగా మాత్రమే దర్శనమివ్వడం వల్ల దీనికి దక్షిణామూర్తి అనే పేరు వచ్చింది.

మరో కోణంలో చూస్తే దక్షిణ అంటే సమర్థత అని కూడా అర్థం. మానవాళి దుఃఖాలన్నింటికి కూడా అజ్ఞానమే మూలకారణం. ఆ అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసి దయాదాక్షిణ్యాలు కలిగిన సమర్థవంతమైన రూపమే ఈ దక్షిణామూర్తిగా భావిస్తారు. శివుని యొక్క ఈ గురు స్వరూపాన్ని ఆరాధించడం వల్ల బుద్ధి వికసిస్తుందని, ఆలోచనా విధానం మెరుగవుతుందని అంటారు. అందుకే విద్యార్థులు ఈ స్వామిని పూజించాలని పెద్దలు చెబుతుంటారు.

పురాణాల ప్రకారం విష్ణువు, బ్రహ్మ, సూర్యుడు, కుమారస్వామి, ఇంద్రుడు వంటి దేవతలంతా కూడా ఈ దక్షిణామూర్తిని ఉపాసించే గురుత్వాన్ని పొందారు. అయితే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఇద్దరూ ఒకరేనా అనే అనుమానం చాలామందికి వస్తుంది. ఆధ్యాత్మిక తత్త్వ దృష్టితో చూస్తే ఇద్దరూ ఒక్కరే అయినా, పూజా విధానాలు , ఉపాసనా క్రమంలో మాత్రం వేర్వేరుగా ఉంటారు. ఇది శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరే అయినా సరే వారి రూపాలు వేరైనట్లుగా భావించాలి.

మంత్రశాస్త్రం ప్రకారం దక్షిణామూర్తి స్వామి వారు చాలా రూపాలలో సాక్షాత్కరిస్తారు. అందులో ప్రధానమైన 16 రూపాలు ఇవే:

1. శుద్ధ దక్షిణామూర్తి
2. మేధా దక్షిణామూర్తి
3. విద్యా దక్షిణామూర్తి
4. లక్ష్మీ దక్షిణామూర్తి
5. వాగీశ్వర దక్షిణామూర్తి
6. వటమూల నివాస దక్షిణామూర్తి (వీణా దక్షిణామూర్తి)
7. సాంబ దక్షిణామూర్తి
8. హంస దక్షిణామూర్తి
9. లకుట దక్షిణామూర్తి
10. చిదంబర దక్షిణామూర్తి
11. వీర దక్షిణామూర్తి
12. వీరభద్ర దక్షిణామూర్తి
13. కీర్తి దక్షిణామూర్తి
14. బ్రహ్మ దక్షిణామూర్తి
15. శక్తి దక్షిణామూర్తి
16. సిద్ధ దక్షిణామూర్తి

Dhakshinaamurthi

మేధా దక్షిణామూర్తి రూపం ప్రత్యేకంగా విద్యార్థులకు చదువును, ఏకాగ్రతను ప్రసాదించే దైవం. సరస్వతీ దేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం అత్యంత భక్తితో కొలిచేది ఈ మేధా దక్షిణామూర్తినే. ఈ స్వామి అనుగ్రహం ఉంటే పిల్లలు చదువుల్లో రాణించి, విద్యావంతులుగా ఎదుగుతారని నమ్ముతారు.

ఈ రూపాలలో వటమూల నివాస దక్షిణామూర్తి రూపంలో.. ఒళ్లంతా విభూతిని ధరించి, తలపై చంద్రకళతో, చేతుల్లో జ్ఞానముద్ర, వీణ, పుస్తకాలను పట్టుకుని, పాములను ఆభరణాలుగా దాల్చిన ఈ రూపం అపారమైన తెలివితేటలను ఇస్తుంది.

Visakhapatnam Port : విశాఖపట్నం పోర్టుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం..వంద శాతం గ్రీన్ పవర్‌తో రికార్డ్

Exit mobile version