SSD Tokens : తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్ల వేళల్లో మార్పు..

SSD Tokens : స్లాటెడ్ సర్వ దర్శనానికి టికెట్లు అందించే సమయాల్లో మార్పులు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల వెళ్లే భక్తులంతా..

SSD Tokens

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సమాచారాన్ని అందించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసే ఫ్రీ దర్శన టికెట్ల సమయాల్లో కీలక మార్పులను చేసింది.

తిరుపతిలో ప్రతిరోజూ జారీ చేసే ఎస్‌ఎస్‌డీ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల(SSD Tokens) పంపిణీ వేళలను మారుస్తూ టీటీడీ అధికారులు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు రోజువారీగా ఉదయం 5 గంటల నుంచి అందించే ఈ ఫ్రీ టోకెట్లను, ఇకపై మధ్యాహ్నం 1.30 గంటల నుంచి టీటీడీ పంపిణీ చేయబోతోంది. అంతేకాదు ఈ కొత్త సమయాల మార్పు ఇప్పటికే అమల్లోకి కూడా వచ్చింది.

ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తిరుపతిలోని మూడు ప్రధాన కేంద్రాల్లో ఈ స్లాటెడ్ సర్వ దర్శనం టికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న విష్ణునివాసం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలోని శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లలో ఈ టోకెట్లను భక్తులకు ఫ్రీగా అందజేస్తున్నారు.

మూడు ప్రధాన కేంద్రాల ద్వారా ప్రతిరోజూ సుమారు 15 వేల టోకెన్ల వరకు భక్తులకు లభిస్తాయి. అంతేకాకుండా వీటికి అదనంగా కాలినడకన శ్రీవారి కొండ మీదకు వెళ్లే భక్తుల కోసం మరో 2 వేల టోకెన్లను ప్రత్యేకంగా కేటాయించారు.

ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ సమర్పించినా సరే.. భక్తుల ఫొటో తీసుకుని ఈ దర్శన టోకెన్లను టీటీడీ ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ టోకెన్లు పొందడానికి మాత్రం భక్తులు 2 నుంచి 3 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి ఉంటుంది.

ఇటీవల వేసవి సెలవుల సందర్భంగా పెరిగిన భక్తుల రద్దీ వల్ల ఈ టోకెట్లను(SSD Tokens) ఉదయం నాలుగు లేదా ఐదు గంటల ప్రాంతంలోనే జారీ చేసేవారు. ప్రస్తుతం స్కూల్స్, కాలేజీలు ప్రారంభం కావడం, వేసవి సెలవులు ముగియడంతో తిరుపతిలో భక్తుల రద్దీ మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది.

దీంతోనే స్లాటెడ్ సర్వ దర్శనానికి టికెట్లు(SSD Tokens) అందించే సమయాల్లో మార్పులు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. తిరుమల వెళ్లే భక్తులంతా..టీటీడీ మార్చిన ఈ సమయాలను బట్టి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

SSD Tokens

మరోవైపు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో జూన్ 25 నుంచి 29 వరకు వార్షిక తెప్పోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను టీటీడీ జేఈవో శరత్ స్వయంగా పరిశీలించారు.

ఐదు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, విద్యుత్, దర్శన సౌకర్యాలు అన్నీ పక్కాగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులను అలరించేందుకు కోలాటాలు, సంగీత కచేరీలు వంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Numerology : నెంబర్ 1 వ్యక్తులు లీడర్స్ ఎందుకవుతారు? 1,10,19,28 తేదీల్లో పుట్టిన వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

Exit mobile version