Bihar : దేశం చూపు ఇప్పుడు బీహార్ వైపు..నాన్ స్టాప్ క్రికెట్‌ విధ్వంసంతో ఆ స్టేట్ ఇమేజ్ మారుతోందా?

Bihar : టీమిండియాలో చాలా రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం కనిపిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో బీహార్ నుంచి కొంతమంది యువ క్రికెటర్లు సంచలన ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నారు

Bihar

ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరే ఆటకూ లేదు. ఒక విధంగా క్రికెట్ ను మతంలా ఆరాధిస్తారు. అందుకే దేశంలో ఏ మూల ఏ గల్లీలో చూసినా ఎక్కడో అక్కడ పిల్లలు, కుర్రాళ్లు, ఉద్యోగాలతో బిజీగా ఉండే వారు సైతం బ్యాట్, బాల్ పట్టుకుని కనిపిస్తుంటారు. ఇక చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆడి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలనుకునే వారి సంఖ్యకు హద్దే లేదు.

ప్రస్తుతం టీమిండియాలో చాలా రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం కనిపిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో బీహార్(Bihar) నుంచి కొంతమంది యువ క్రికెటర్లు సంచలన ప్రదర్శనలతో దుమ్మురేపుతున్నారు. వైభవ్ సూర్యవంశీ, సకిబుల్ గని.. తాజాగా అక్షర గుప్తా వంటి ప్లేయర్స్ తో ఇప్పుడు బీహార్ క్రికెట్ కార్ఖానాగా మారిపోయింది.

ప్రస్తుతం భారత క్రికెట్ లో బీహార్(Bihar) పేరు మారుమోగిపోతోంది. గత ఏడాదిన్నర కాలంగా వైభవ్ సూర్యవంశీతో ఇది మొదలైంది. 14 ఏళ్లకే ఈ బుడ్డోడు చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు. ఇప్పుడు 15 వ ఏట అది మరింత రెట్టింపయింది. గత ఏడాది ఐపీఎల్ లో అడుగుపెట్టగానే సెంచరీతో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ జోరు ఇప్పటికీ నాన్ స్టాప్ గానే కొనసాగుతోంది.

ఈ ఏడాది ఐపీఎల్ లో బీహారీ బుడ్డోడి జోరు మామూలుగా లేదు. తొలి మ్యాచ్ నుంచే పరుగుల వరద పారించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అవార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక ట్రై సిరీస్ లో ఉన్న వైభవ్ త్వరలో టీమిండియా తరపున అరంగేట్రం చేయబోతున్నాడు.

ఇటీవల వైభవ్ సూర్యవంశీ సోదరుడు ఆశీర్వాద్ కూడా సత్తా చాటుతున్నాడు. స్థానిక టోర్నమెంట్ లో పదేళ్ళకే సెంచరీ బాదేశాడు. ఇదిలా ఉంటే బీహార్ రంజీ కెప్టెన్ గా ఉన్న సకిబుల్ గని కూడా పలు రికార్డులు నెలకొల్పాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. కేవలం 32 బంతుల్లోనే శతకం బాదాడు. బ్యాటింగ్‌లో అసాధారణమైన టైమింగ్, దూకుడు కలిగిన ఆటగాడిగా గని గుర్తింపు పొందాడు.

మరోవైపు కేవలం పురుషుల క్రికెట్ కే కాదు బీహార్(Bihar) నుంచి మహిళల క్రికెట్ లోనూ యంగ్ ప్లేయర్స్ దూసుకొస్తున్నారు. తాజాగా బీహార్ కు చెందిన అక్షర గుప్తా 15 ఏళ్లకే ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేసింది. మహిళల అండర్ 19 వన్డే ట్రోఫీలో అక్షర కేవలం 126 బంతుల్లోనే 306 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది.

Bihar

ఆమె ఇన్నింగ్స్ లో 55 ఫోర్లు, 8 సిక్సర్లున్నాయి. అక్షర 14 ఏళ్ల వయసులోనే అండర్ 19 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది. మొన్నటి వరకు బీహార్ అంటే చాలా మందికి చిన్నచూపు ఉండేది. ఎక్కడ దొంగలు దొరికినా వారి మూలాలు బీహార్ వే అన్న అభిప్రాయం ఉండిపోయింది.

అయితే ఇప్పుడు అదే బీహార్ నుంచి దేశం గర్వించదగిన యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తుండడంతో ఆ రాష్ట్రంపై అభిప్రాయం మారుతోంది. అటు బీహార్ ప్రజలు సైతం తమ యంగ్ టాలెంటెడ్ క్రికెటర్లను చూసి గర్వపడుతున్నారు.

Annadatha Sukhibhava : రేపే అన్నదాతలకు అసలైన పండగ.. వారి అకౌంట్లలో పడనున్న డబ్బులెంతో తెలుసా?

Exit mobile version