Sunrisers captain : సన్ రైజర్స్ కు బిగ్ షాక్…ప్యాట్ కమ్మిన్స్ డౌటే

Sunrisers captain : కమిన్స్ కాదు.. సన్ రైజర్స్ కెప్టెన్ విషయంలో బిగ్ ట్విస్ట్

Sunrisers captain

ఐపీఎల్ 2026 సీజన్ కు ఇంకా 10 రోజులే మిగిలింది. ఇప్పటికే అన్ని జట్లూ తమ ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలకు విదేశీ ఆటగాళ్ల గాయాలు ఆందోళనగా మారాయి. వేలంలో కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే ఇప్పుడు ఆ స్టార్ ప్లేయర్స్ తో గాయాలతో దూరమవుతుండడం ఫ్రాంచైజీలకు ఇబ్బందిగా మారింది.

ఈ గాయాల బెడద దాదాపు అన్ని జట్లకూ ఉంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers captain) కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది. డిసెంబర్ లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కమ్మిన్స్ అప్పటి నుంచీ ఆటకు దూరమయ్యాడు.

టీ20 ప్రపంచకప్ నుంచి సైతం తప్పుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే దీనికి కారణం. అతను లేకపోవడం మెగాటోర్నీలో ఆసీస్ బౌలింగ్ బాగా బలహీనంగా మారిపోయింది. చివరికి జింబాబ్వే చేతిలోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గతేడాది వెస్టిండీస్‌ తో ఆడుతుండగా వెన్ను గాయానికి గురైన కమిన్స్.. ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఒక్క టెస్ట్ మాత్రమే ఆడాడు.

ప్రస్తుతం ఈ ఆసీస్ సారథి ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మెడికల్ టీమ్ అతని ఫిట్ నెస్ ను పర్యవేక్షిస్తోంది. సీఏ మెడికల్ టీమ్ క్లియరెన్స్ ఇస్తే తప్ప ఐపీఎల్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత పలు కీలక సిరీస్ లు ఉండడంతో ఆసీస్ సెలక్టర్లు ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు.

Sunrisers captain

ఆ నేపథ్యంలో కమ్మిన్స్ ఇప్పుడు ఐపీఎల్ లో పలు మ్యాచ్ లకు దూరమవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిట్ నెస్ సాధిస్తే సీజన్ మధ్యలో సన్ రైజర్స్(Sunrisers captain) జట్టులో చేరే అవకాశాలున్నాయి. 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఫైనల్ వరకూ చేర్చిన కమ్మిన్స్ గత సీజన్ లోనూ ఆ జట్టును నడిపించాడు.

అయితే కమ్మిన్స్ దూరమవడంతో కెప్టెన్సీ ఆప్షన్స్ జట్టులో బాగానే ఉన్నా.. అనుభవం ఉన్న కీలకమైన పేసర్ ను కోల్పోవడం సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో, స్లాగ్ ఓవర్లలో కమ్మిన్స్ అవసరం హైదరాబాద్ జట్టుకు బాగానే ఉంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version