Boxing
కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేటలో పుంజుకుంటోంది. చాలా క్రీడలు తొలగించడంతో ఈసారి తక్కువ మెడల్స్‌కే పరిమితమవుతుందని అంచనా వేసారు. అయితే అంచనాలు పెట్టుకున్న కొన్ని క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు.
తాజాగా ఆరో రోజు పోటీల్లో భారత బాక్సర్ల ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. మహిళల, పురుషుల విభాగాల్లో పోటాపోటీగా మెడల్స్ ఖాయం చేశారు. బుధవారం ఒక్కరోజే ఐదుగురు బాక్సర్లు సెమీఫైనల్లో అడుగుపెట్టారు. దీంతో భారత్‌కు బాక్సింగ్(Boxing)లో ఇప్పటి వరకూ 8 మెడల్స్ ఖరారయ్యాయి.
మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా, 54 కేజీల విభాగంలో ప్రీత పవార్ , 60 కేజీల విభాగంలో ప్రియ గంగాస్, పురుషుల 55 కేజీల విభాగంలో జాదుమణి సింగ్ మంగళవారమే పతకాలు ఖాయం చేసుకున్నారు. వీరిచ్చిన జోష్‌తో బుధవారం కూడా భారత బాక్సర్లు దుమ్మురేపారు. మొదట మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరీ క్వార్టర్ ఫైనల్స్‌లో అద్భుత విజయాలను అందుకున్నారు.
క్వార్టర్ ఫైనల్లో సాక్షి చౌదరి ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్‌పై 5-0 తేడాతో గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో అరుంధతి చౌదరి న్యూజిలాండ్‌కు చెందిన బాక్సర్ మోర్గాన్ హెండర్సన్‌పై 3-1తో గెలుపొందింది.
ఇదిలా ఉంటే పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. అతనితో పాటు పురుషుల 80 కేజీల విభాగంలో అంకుశ్ ఫంగల్, 90 కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ కూడా సెమీస్ చేరుకున్నాడు. బాక్సింగ్(Boxing)లో సెమీస్ చేరితే కనీసం కాంస్య పతకం లభిస్తుంది.
మరోవైపు కామన్ వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ రజతం గెలుచుకున్నాడు. దీని ద్వారా ఈ విభాగంలో రజతం గెలిచిన తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకూ భారత్ 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి 12 పతకాలతో పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పతకాల పట్టికలో ఆధిపత్యం కనబరుస్తోంది. ఆస్ట్రేలియా 35 స్వర్ణాలు, 18 రజతాలు, 28 కాంస్యాలతో 81 పతకాలు గెలిచింది. కెనడా 36 పతకాలు, ఇంగ్లాండ్ 44 పతకాలు, స్కాట్లాండ్ 16 , నైజీరియా 12 పతకాలతో టాప్ 5లో కొనసాగుతున్నాయి.
ICC Rankings : వన్డే ర్యాం”కింగ్”గిల్.. టీ ట్వంటీ టాప్ 50లోకి వైభవ్
