Delhi Capitals
ఐపీఎల్ 19వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత పుంజుకున్న ఢిల్లీ(Delhi Capitals) రాజస్థాన్ రాయల్స్ కు షాకిచ్చింది. హై స్కోరింగ్ మ్యాచ్ లో అదరగొట్టిన ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్ లో మిఛెల్ స్టార్క్ , బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ , నిస్సాంక అదరగొట్టారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ లో ఉన్న జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ త్వరగానే ఔటయ్యారు. కేవలం 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. దీంతో కనీసం 150 పరుగులైనా చేస్తుందా అనుకున్నారు. ఈ దశలో రియాన్ పరాగ్, జురెల్ రాజస్థాన్ ను ఆదుకున్నారు.
ఈ సీజన్ లో ఇప్పటి వరకూ పెద్దగా ఆడని పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. జురెల్ తో కలిసి మూడో వికెట్ కు 102 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జురెల్ 42 పరుగులకు ఔటైనా పరాగ్, జడేజాతో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. జడేజా (20) ఔటైన తర్వాత పరాగ్ కూడా 50 బంతుల్లో 90 (8 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు.
అయితే చివర్లో ఫెరీరా విధ్వంసం సృష్టించాుడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 47 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 225 పరుగులు చేసింది.ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన మిఛెల్ స్టార్క్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు.
ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు నిస్సాంక, కెఎల్ రాహుల్ దుమ్మురేపారు. రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్న వీరిద్దరూ తొలి వికెట్ కు 110 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నిస్సాంక 33 బంతుల్లో 62 (6 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేయగా.. రాహుల్ దూకుడు కొనసాగించాడు.
నితీశ్ రాణాతో కలిసి 61 పరుగులు జోడించాడు. రాణా 17 బంతుల్లో 33 రన్స్ కు ఔటవగా.. కెఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 (6 ఫోర్లు , 5 సిక్సర్లు) పరుగులు చేశాడు. తర్వాత స్టబ్స్ (18) , అశుతోష్ శర్మ (25) నాటౌట్ గా నిలిచి జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఈ సీజన్ లో ఢిల్లీ(Delhi Capitals)కి ఇది నాలుగో విజయం..
Pensioners : పెన్షనర్లకు కేంద్రం భారీ కానుక.. రూ. 7,500కు చేరనున్న కనీస పెన్షన్
