Gambhir
శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఇప్పుడు భారత్‌కు చాలా కీలకంగా మారింది. ఈ సిరీస్‌ను 2-0తో గెలిస్తేనే టీమిండియా ఫైనల్ రేసులో ఉంటుంది. లేకపోతే ఇక్కడితో కథ ముగిసినట్టే. అంతే కాదు ఈ సిరీస్ హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు అగ్ని పరీక్షగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిరీస్.. టెస్ట్ కోచ్‌గా గంభీర్ భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది.
ఇప్పటికే గంభీర్ కోచింగ్ శైలిపై సీనియర్లు చాలా అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పైగా బీసీసీఐ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నిజానికి గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత టెస్టుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అయితే వాటిని అందుకోవడంలో మాత్రం గంభీర్ ఘోరంగా విఫలమయ్యాడనే చెప్పాలి.
టెస్టు క్రికెట్‌లో గౌతమ్ గంభీర్(Gambhir) కోచ్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడానికి జట్టు కూర్పులో ఆయన చేసిన ప్రయోగాలే కొంపముంచాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే సీనియర్ ఆటగాళ్లతో సమన్వయ లోపం కూడా కారణంగా చెప్పొచ్చు. ఎక్కువగా యువ ఆటగాళ్లతోనే ఫలితాలు సాధించాలన్న గంభీర్ వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయింది.
తాజాగా మాజీ ప్లేయర్ రహానే చెప్పినట్టు రెడ్ బాల్ క్రికెట్‌లో అనుభవం ఉన్న ప్లేయర్స్ విజయాలను అందిస్తారు. కుర్రాళ్లు కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. మొత్తం ఒకేసారి వాళ్ల పైన భారం పెడితే మాత్రం ఫలితాలు రివర్స్ అవుతాయి.
వైట్‌బాల్ క్రికెట్‌లో గంభీర్(Gambhir) యువ ఆటగాళ్ల వ్యూహంతో విజయాలు సాధించినా సరే.. రెడ్-బాల్ ఫార్మాట్‌లో మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. టెస్టుల్లో ప్రత్యేక బ్యాటర్లు , బౌలర్లను కాకుండా ఆల్ రౌండర్‌పై ఫోకస్ పెట్టడం ఈ వైఫల్యాలకు కారణంగానే చెప్పొచ్చు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేయడం, క్లిష్టమైన పిచ్‌లపై ఆటగాళ్ల టెంపర్‌మెంట్ లోపించడం వంటి రీజన్స్‌తో గంభీర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఇప్పుడు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే శ్రీలంక సిరీస్ గంభీర్ ఫ్యూచర్‌ను నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది.
Emotional Attrition : ఎమోషనల్ అట్రిషన్ గురించి తెలుసా? మీ సర్కిల్‌లో అలాంటి పర్సన్ ఉన్నారా?
