GT vs RR : టైటాన్స్ వర్సెస్ రాయల్స్..గుజరాత్ తో రాజస్థాన్ కీలక పోరు

GT vs RR : వరుస విజయాలతో దూసుకెళుతున్న గుజరాత్ , రాజస్థాన్ తో తలపడబోతోంది. గత మూడు మ్యాచ్ లలోనూ గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంది

GT vs RR

ఐపీఎల్ 19వ సీజన్ లో టాప్ 4 రేస్ మరింత రసవత్తరంగా మారిపోతోంది. ఆరంభంలో వరుస విజయాలు సాధించిన జట్లను ఇప్పుడు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్స్ టెన్షన్ పెడుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ , గుజరాత్ టైటాన్స్(GT vs RR) కీలక పోరుకు సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో దూసుకెళుతున్న గుజరాత్ , రాజస్థాన్(GT vs RR) తో తలపడబోతోంది. గత మూడు మ్యాచ్ లలోనూ గుజరాత్ టైటాన్స్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంది.

బౌలింగ్ లోనూ , బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించింది. ఒకదశలో రేసులో వెనుకబడిందనుకున్న టైటాన్స్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ తో ఇప్పుడు దూసుకొచ్చింది. చెన్నై, బెంగళూరు, పంజాబ్ జట్లపై ఛేజింగ్ చేసి విజయాలను అందుకుంది. బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ , గిల్ మెరుపు ఆరంభాలనిస్తుండగా… బట్లర్ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు.

తెవాటియా మాత్రం ఇంకా ఫామ్ లోకి రాలేదు. అటు జాసన్ హోల్డర్ మాత్రం ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ లో గుజరాత్ కు మ్యాచ్ విన్నర్ గా మారిపోయాడు. పెద్ద జట్లపై అద్భుతమైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. అటు రబాడ, సిరాజ్ తో పాటు అర్షద్ ఖాన్ పేస్ విభాగంలో కీలకంగా ఉన్నారు. ఇటు స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ రాణిస్తున్నారు.

మరోవైపు గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ 10 మ్యాచ్ లలో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్ లు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖరారవుతుంది. రాజస్థాన్ రాయల్స్ బలమంతా బ్యాటింగే.

GT vs RR

ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆరంభాలను అందిస్తున్నారు. కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. చివర్లో శుభమ్ దూబే, ఫెరీరా, జడేజా కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్ లో ఆర్చర్ , బర్గర్ అదరగొడుతుంటే , స్పిన్ విభాగంలో జడేజా, రవి బిష్ణోయ్ తమ మ్యాజిక్ చూపిస్తున్నారు.

అయితే గుజరాత్ బౌలర్లను రాజస్థాన్ బ్యాటర్లు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాలి. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు 9 సార్లు తలపడితే గుజరాత్ ఆరింటిలో గెలిచింది. పిచ్ విషయానికొస్తే జైపూర్ లో మరోసారి పరుగుల వరద ఖాయమని అంచనా వేస్తున్నారు.

Magic Figure : మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది..దళపతికి లైన్ క్లియర్

Exit mobile version