Ahmedabad Stadium : ఈ సారైనా కలిసొచ్చేనా ?..భారత్‌కు అచ్చిరాని మోదీ స్టేడియం

Ahmedabad Stadium : టీ20 ప్రపంచకప్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడబోతోంది.

Ahmedabad Stadium

టీ20 ప్రపంచకప్ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం జరిగే మెగా ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఈ టైటిల్ ఫైట్ కు ముందు భారత్ ఫ్యాన్స్ ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2023 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇదే స్టేడియం వేదికగా పరాజయం పాలైంది. ఈ సారి టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఎదుర్కొన్న ఒక్క ఓటమి కూడా ఇదే స్టేడియంలో వచ్చిందే. మరి సెంటిమెంట్ పరంగా కలిసిరాని మోదీ స్టేడియంలో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందా ?

మన దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ.. అది క్రికెట్ అయినా, ఇంకెక్కడయినా సరే వాటిని కచ్చితంగా ఫాలో అవుతుంటారు. భారత క్రికెట్ జట్టు కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రస్తుతం ఈ చర్చంతా టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ స్టేడియం(Ahmedabad Stadium) గురించే.. ఎందుకంటే ఈ స్టేడియం భారత జట్టుకు ఎంతమాత్రం కలిసిరాలేదు. ఆదివారం ఫైనల్లో న్యూజిలాండ్ ను ఇదే వేదికలో ఢీకొనబోతూ ఉండటంతో అభిమానుల్లోనూ, ఇటు టీమిండియా మేనేజ్ మెంట్ కూ ఆ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరున్న అహ్మదాబాద్ లో ఓవరాల్ గా భారత్ రికార్డు బాగానే ఉన్నా మెగాటోర్నీకి వచ్చేసరికి అస్సలు కలిసిరాలేదు. 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అభిమానులకు ఒక చేదు జ్ఞాపకం. ఫైనల్ వరకూ అప్రతిహాతంగా జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చిన టీమిండియా అసలు పోరులో మాత్రం చతికిలపడింది. లీగ్ స్టేజ్ లో పాక్ ను ఇదే వేదికలో చిత్తు చేసిన భారత్ ఫైనల్లో మాత్రం ఆసీస్ పై చేతులెత్తేసింది.

Ahmedabad Stadium

ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లోనూ భారత్ ఓడిపోయిన ఏకైక మ్యాచ్ కూడా ఇదే వేదికపైనే.. సూపర్ 8 స్టేజ్ ఆరంభ మ్యాచ్ లో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా అహ్మదాబాద్ స్డేడియంలోనే పరాజయం పాలైంది. 188 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక కేవలం 111 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇప్పుడు భారత్ అభిమానులను ఈ ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడుతోంది.

ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిని, ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాపై ఓటమిని గుర్తు చేస్తూ అహ్మదాబాద్ స్టేడియం(Ahmedabad Stadium) ఈసారైనా భారత్ కు కలిసొస్తుందా అని చర్చించుకుంటున్నారు. ఓవరాల్ గా మాత్రం ఈ  స్టేడియంలో భారత్ సాధించిన రికార్డులు బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకూ అహ్మదాబాద్ స్టేడియంలో టీమిండియా 10 టీ20లు ఆడితే ఏడింటిలో గెలిస్తే మూడు ఓడిపోయింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version