IND VS PAK : భారత్,పాక్ మ్యాచ్ క్రేజ్ఇదీ..స్టేడియానికి రికార్డు స్థాయిలో ఫ్యాన్స్

IND VS PAK : మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ లీగ్ స్టేజ్ మ్యాచ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది

IND VS PAK

ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్తాన్(IND VS PAK) మ్యాచ్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫార్మాట్ ఏదైనా రెండు జట్లు తలపడుతుంటే ఫ్యాన్స్ వెర్రెక్కిపోతారు. ఆడేది పురుషుల జట్టైనా , మహిళల జట్టైనా అందరిలోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. చిరకాల ప్రత్యర్ధుల మధ్య మ్యాచ్ కు ఆదరణ ఏంటనేది మరోసారి రుజువయింది.

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్, పాకిస్తాన్(IND VS PAK) మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అటు స్టేడియానికి హాజరైన ఫ్యాన్స్ సంఖ్యలోనూ , ఇటు వ్యూయర్ షిప్ లోనూ రికార్డులు కొల్లగొట్టింది. మహిళల జట్ల మధ్య మ్యాచ్ అయినా దాయాది దేశాలు కావడంతో స్టేడియానికి అభిమానులు పోటెత్తారు.

దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ లీగ్ స్టేజ్ మ్యాచ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది.గతంలో కూడా భారత్, పాక్ మధ్యనే జరిగిన పోరు ఈ రికార్డు నెలకొల్పింది. తాజా మ్యాచ్ దాన్ని బ్రేక్ చేసింది. టీ ట్వంటీ ఫార్మాట్ కావడంతో ఈ మ్యాచ్ చూసేందుకు ఏకంగా 18,814 మంది అభిమానులు తరలి వచ్చారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో ఒక మ్యాచ్‌కు ఇంతటి భారీ స్థాయిలో అభిమానులు రావడం ఇదే మొదటిసారి. గతంలో 2024న దుబాయ్‌ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు 15,935 మంది వచ్చారు. తాజాగా ఈ రికార్డును బర్మింగ్ హమ్ మ్యాచ్ రికార్డు బ్రేక్ చేసింది.

మహిళల క్రికెట్ కు ఏ స్థాయిలో క్రేజ్ పెరిగింది అనేది ఈ మ్యాచ్ ద్వారా రుజువైందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పైగా భారత్ మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మన మ్యాచ్ లను చూసే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుత ప్రపంచ కప్ లోనూ భారత్ టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటిగా ఉండడం కూడా క్రేజ్ పెరగడానికి కారణమైంది.

IND VS PAK

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో భారత మహిళల జట్టు.. పాకిస్తాన్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత స్పిన్నర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు.

దీప్తి శర్మ , శ్రీ చరణి.. తమ స్పిన్ మ్యాజిక్ తో పాక్ ను దెబ్బ కొట్టారు. దీప్తి శర్మ 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసింది. శ్రీ చరణి 3 వికెట్లు పడగొట్టింది. పాక్.. 17 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది.

Karma : ఇన్‌స్టంట్ కర్మ..చేసిన తప్పుకి అక్కడే, అప్పుడే లెక్క తేల్చేస్తాది..

Exit mobile version