IND vs SL
గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించినట్టే కనిపిస్తోంది. వర్షం అంతరాయం కలిగిస్తున్న ఈ మ్యాచ్‌లో మూడోరోజు శ్రీలంక తడబడి నిలబడింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 2 పరుగులు జోడించి భారత్ 462కు ఆలౌటైంది.
వెంటనే ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకను భారత బౌలర్లు కంగారెత్తించారు. ఆరంభం నుంచే వరుస వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ఖాతా తెరవకుండానే ఓపెనర్ నిస్సాంకను సిరాజ్ ఔట్ చేశాడు. ఇక్కడ నుంచి భారత స్పిన్నర్లు తమ మ్యాజిక్ చూపించారు.
చండిమాల్ 4, కమిందు మెండిస్ 14, ఉదార 27 పరుగులకు వెనుదిరిగారు. ధనంజయ డిసిల్వా కూడా నిలదొక్కుకోవడానికి జడేజా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో లంక 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఇక 150 లోపే లంక తొలి ఇన్నింగ్స్‌కు తెరపడుతుందనుకుంటున్న దశలో సోనాల్ దినుషా,, వికెట్ కీపర్ డిక్ విల్లా అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. వీరి పార్ట్‌నర్‌షిప్ కారణంగానే లంక స్కోరు 280 దాటగలిగింది.
అప్పటి వరకూ తమ స్పిన్ మ్యాజిక్‌తో వరుస వికెట్లు తీసిన కుల్దీప్ , జడేజా, సుతార్ వీరి పార్ట్‌నర్‌షిప్ ను బ్రేక్ చేయలేకపోయారు. ఫలితంగా చివరి సెషన్ వరకూ వీరి బ్యాటింగ్ కొనసాగింది. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరికి 80 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర డిక్ విల్లాను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత టెయిలెండర్లతో కలిసి దినుష స్కోరు పెంచాడు.
ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకుని అదే స్కోరు దగ్గర ఔటయ్యాడు. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు, కుల్‌దీప్ , ప్రసిధ్ కృష్ణ , సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో భారత్ కు 178 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
ఒక దశలో ఫాలో ఆన్ ఆడుతుందనుకున్న లంక ఈ విధంగా పోరాడడంతో భారత్ ఆధిపత్యానికి బ్రేక్ వేసినట్టయింది. అయినా సరే ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం టీమిండియానే మెరుగైన పొజిషన్‌లో ఉంది.
మూడోరోజు మరో 13 ఓవర్ల ఆట మిగిలి ఉన్నా కూడా వెలుతురు మందగించడంతో త్వరగానే ముగించాల్సి వచ్చింది. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టలేదు. నాలుగోరోజు భారత్ ఎంత వేగంగా పరుగులు చేసి లంక ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి.
BJP : ఏపీకి ట్రిపుల్ ఆఫర్ తెలంగాణకు ఊహించని షాక్..బీజేపీ కొత్త జాతీయ టీమ్ ఇదే..
