IND vs SL : కొలంబో టెస్టులో శ్రీలంకపై టీమిండియా దండయాత్ర..మూడే మూడు ఓవర్లలో లంక మైండ్ బ్లాంక్..

IND vs SL : టీమ్ స్కోరు 500 దాటగానే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డిక్లేర్ కాల్ ఇచ్చి లంకను సాయంత్రం వేళ బ్యాటింగ్‌కి రప్పించాడు.ఇక్కడే మనోళ్ల ప్లాన్ పక్కాగా వర్కవుట్ అయింది.

IND vs SL

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శ్రీలంకకు మనోళ్లు సాలిడ్‌గా సినిమా చూపించేస్తున్నారు. రెండో టెస్టులో టాస్ దగ్గర నుంచి బోర్డు మీద స్కోరు వరకు ప్రతీది మనోళ్లు అనుకున్నట్లే జరుగుతోంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ నాటౌట్ సెంచరీ (115) తో గ్రౌండ్ నాలుగుమూలలా షాట్లు బాదితే, మరోవైపు గాయం నుంచి తిరిగొచ్చిన రిషభ్ పంత్ (63) తన మార్క్ మారణహోమాన్ని సృష్టించాడు.

దీంతో బోర్డు మీద 503/9 రన్స్ భారీ స్కోరు సాధించిన భారత్ కెప్టెన్ గిల్.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఇక ఆ తర్వాత అసలు సీన్ మొదలైంది. వెలుతురు తగ్గుతున్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంకను, మన బౌలర్లు మూడే మూడు ఓవర్లలో 8 పరుగులకే 2 వికెట్లు తీసి లంక వెన్నెముక విరిచేశారు. ప్రస్తుతం ఏకంగా 495 పరుగులు వెనుకబడిన శ్రీలంక , ఓటమి భయంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

అయితే రెండో రోజు ఆట స్టార్ట్ అయిన వెంటనే ఇండియాకు చిన్న బ్రేక్ పడింది. డెబ్యూ ప్లేయర్ సారాంశ్ జైన్.. లంక బౌలర్ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్‌కి బుక్ అయిపోయాడు. ఆ టైమ్‌లో క్రీజులోకి వచ్చిన పంత్, నిలకడగా ఆడుతున్న జురెల్‌తో కలిసి శ్రీలంక బౌలింగ్‌ను చీల్చి చెండాడటం మొదలుపెట్టాడు.

నిన్న గాయంతో మైదానం నుంచి వెనుదిరిగిన పంత్, ఈరోజు అసలు వడ్డీతో సహా లంక బౌలర్లు వేసిన బౌన్సర్లను విరగ్గొట్టాడు. మెయిన్‌గా లహిరు కుమార వేసిన ఓవర్లలో పంత్ కొట్టిన సిక్స్.. స్టేడియం రూఫ్ పైకి వెళ్లి అక్కడున్న సోలార్ ప్యానెల్‌ని పగలగొట్టింది. దెబ్బకి బంతి షేప్ అవుట్ అవ్వడంతో అంపైర్లు కొత్త బాల్ తీసుకోవాల్సి వచ్చింది.

పంత్ వీరబాదుడుకి జురెల్ ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో లంచ్ టైమ్‌కే భారత్ కంప్లీట్ సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. పంత్ 21వ ఫిఫ్టీ, జురెల్ 3వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత ఫస్ట్ బాల్‌కే పంత్ అవుట్ అయిపోవడంతో లంక కాస్త ఊపిరి పీల్చుకుంది.

IND vs SL

కానీ తర్వాత వచ్చిన మానవ్ సుతార్‌తో కలిసిన జురెల్, మ్యాచ్ మధ్యలో రెండు గంటల పాటు వర్షం పడినా ఏమాత్రం ఫోకస్ తగ్గకుండా ఆడాడు. వర్షం తగ్గాక ఫెర్నాండో బౌలింగ్‌లో కవర్ డ్రైవ్‌తో సింగిల్ తీసి లంక గడ్డపై తన ఫస్ట్ టెస్ట్ సెంచరీ కొట్టేశాడు. సెంచరీ రాగానే తన చేతిపై ఉన్న ..జై జవాన్, జై కిసాన్ టాటూను స్టేడియానికి చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవడం హైలైట్‌గా నిలిచింది.

టీమ్ స్కోరు 500 దాటగానే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డిక్లేర్ కాల్ ఇచ్చి లంకను సాయంత్రం వేళ బ్యాటింగ్‌కి రప్పించాడు.ఇక్కడే మనోళ్ల ప్లాన్ పక్కాగా వర్కవుట్ అయింది. లైటింగ్ సరిగ్గా లేని టైమ్‌లో క్రీజులోకి వచ్చిన లంక ఓపెనర్ లహిరు ఉదార (1)ని ప్రసిధ్ కృష్ణ తన రెండో బంతికే పెవిలియన్‌కి పంపించేశాడు. ఇక రెండో రోజు లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్‌కి మానవ్ సుతార్ వేసిన స్పిన్‌కి.. ప్రభాత్ జయసూర్య ఎల్బీగా దొరికిపోవడంతో లంక సీన్ రివర్స్ అయిపోయింది. అక్కడితో ఈరోజు ఆట ముగిసింది.

Rajinikanth Biopic : ఇక బుక్ రూపంలో తలైవా లైఫ్ జర్నీ..బయోపిక్‌పై సౌందర్య ప్లాన్..

Exit mobile version