Just EntertainmentLatest News

Rajinikanth Biopic : ఇక బుక్ రూపంలో తలైవా లైఫ్ జర్నీ..బయోపిక్‌పై సౌందర్య ప్లాన్..

Rajinikanth Biopic : ఫ్యూచర్‌లో ఒకవేళ తన తండ్రి జీవిత కథను వెండితెరపై బయోపిక్‌గా తీసే అవకాశం వస్తే.. అది తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన విషయంగా భావిస్తానని సౌందర్య సంతోషంగా వివరించారు.

Rajinikanth Biopic

భారతీయ సినీ ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో సూపర్‌స్టార్‌గా రాజ్యమేలుతున్న రజనీకాంత్ జీవితం ఒక సినిమా కథను తలపిస్తుందన్న విషయం చాలామందికి తెలిసిందే. బస్ కండక్టర్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్‌గా ఎదిగిన తలైవా సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, పడిన కష్టాలు ఇకపై పుస్తక రూపంలో రాబోతున్నాయి.

రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఫ్యాన్స్‌కి కళ్లు చెదిరే గుడ్‌న్యూస్ వినిపించారు. తన తండ్రి ఆత్మకథ రూపకల్పన ప్రాసెస్ అంతా .. చాలా డిఫరెంట్‌గా, ఎంతో కేర్‌తో సాగుతోందని వివరించారు.

రజనీకాంత్ యాభై ఏళ్ల సినీ కెరీర్‌లోని సాధించిన చారిత్రాత్మక విజయాలు,కెరీర్‌కు ముందు.. కెరీర్ ప్రారంభంలో తెరవెనుక ఎదుర్కొన్న సవాళ్లు, అగ్రస్థానానికి చేరుకునే సమయంలో ఆయన పాటించిన లైఫ్ వాల్యూస్ ఈ పుస్తకంలో ఉండబోతున్నాయి.

జగద్గురు పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ ఏ విధంగా అయితే కోట్లాది మందికి ఆధ్యాత్మిక వెలుగును పంచిందో, అదే తరహాలో తన తండ్రి ఆత్మకథ కూడా వచ్చే ఎన్నో తరాలకు మైండ్ బ్లాకింగ్ స్ఫూర్తిని అందిస్తుందని సౌందర్య నమ్మకంగా చెప్పారు.

Rajinikanth Biopic
Rajinikanth Biopic

అంతేకాకుండా, ఫ్యూచర్‌లో ఒకవేళ తన తండ్రి జీవిత కథను వెండితెరపై బయోపిక్‌గా తీసే అవకాశం వస్తే.. అది తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన విషయంగా భావిస్తానని ఆమె సంతోషంగా వివరించారు. క్రియేటివిటీకి క్లారిటీ, క్రమశిక్షణే పునాదులని తన తండ్రి తనకు నేర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు.

ఇక సౌందర్య ప్రొడక్షన్ డీటెయిల్స్‌లోకి వెళ్తే.. ప్రస్తుతం ఆమె ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం లవ్ పేరుతో ఒక ట్రెండీ రొమాంటిక్ తమిళ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ అండ్ కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో క్రేజీ యాక్టర్స్ అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి మెయిన్ లీడ్స్‌గా నటిస్తున్నారు. ఈ మ్యాజికల్ లవ్ స్టోరీ సిరీస్.. అక్టోబర్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది.

Parandur Airport Project : ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసిన సీఎం విజయ్..రైతుల పక్షాన నిలిచి చరిత్ర సృష్టించిన నాయకులున్నారా?

Related Articles

Back to top button