India
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో భారత్(India) ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. భారీస్కోరు చేసినా వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆఫ్ఘన్ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్(India) ఏ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రభ్ సిమ్రన్ సింగ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు.
తొలి మ్యాచ్ లో శ్రీలంకపై నిరాశపరిచిన చిచ్చర పిడుగు వైభవ్ ఈ మ్యాచ్ లో మెరుపులు మెరిపించాడు. తన సహజ శైలిలో దుమ్మురేపాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ తో కలిసి వైభవ్ తొలి వికెట్ కు 7.1 ఓవర్లలో 74 పరుగులు జోడించాడు.
కాసేపటికే ప్రియాన్ష్ ఆర్య (8) కూడా ఔటవడంతో భారత్ ఏ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ప్రభ్ సిమ్రన్ , రుతురాజ్ గైక్వాడ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 79 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. సెంచరీ చేస్తాడనుకున్న ప్రభ్ సిమ్రన్ 69 బంతుల్లో 84 (14 ఫోర్లు) పరుగులకు వెనుదిరిగాడు. తర్వాత రుతురాజ్ , కెప్టెన్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొనసాగించారు.
తొలి మ్యాచ్ లో లంకపై కీలక పార్ట్నర్ షిప్ షిప్ సాధించిన వీరి జోడీ మరోసారి సత్తా చాటింది. 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. రుతురాజ్ గైక్వాడ్ 66(3 ఫోర్లు), తిలక్ వర్మ 66 (5 ఫోర్లు) పరుగులు చేయగా.. ఆయుశ్ బదోనీ (0) నిరాశ పరిచాడు. తర్వాత సూర్యాన్ష్ షెడ్గే దాటిగా ఆడి 40 పరుగులు చేయగా.. చివర్లో భారత్ ఏ వరుసగా వికెట్లు కోల్పోయింది.
మధ్యలో వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో భారత్ ఏ 9 వికెట్లకు 349 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో అబ్దుల్లా 5 , సఫి 3 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఏ కూడా దీటుగానే స్పందించింది. ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. కెప్టెన్ ఇమ్రాన్ మిర్, హస్సన్ తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు.
హస్సన్ (34)ను అర్షద్ ఖాన్ ఔట్ చేయగా, తనివల్ (2) ను అంకుల్ రాయ్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత బహిర్ షా, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ మూడో వికెట్ కు అజేయమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 108 పరుగులు జోడించారు. క్రమంగా క్రీజులో నిలదొక్కుకున్న వీరి జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది.
అయితే 25.5 ఓవర్లలో 177/2 పరుగుల స్కోర్ దగ్గర భారీ వర్షం అడ్డుపడింది. దీంతో అంపైర్లు డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో ఆఫ్ఘనిస్తాన్ గెలిచినట్టు ప్రకటించారు. అప్పటికి డీఎల్ఎస్ విధానం ప్రకారం ఆఫ్ఘన్ జట్టు 4 పరుగులు ముందంజలో ఉంది. దీంతో భారత్(India) కు ఓటమి తప్పలేదు.
Vishaka Steel Plant : విశాఖ ఉక్కు ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్..9 మంది మృతిపై సుమోటో
