England : బుమ్రా రీఎంట్రీ..జైస్వాల్ ఔట్..ఫిట్ అయితేనే ఇంగ్లాండ్ టూర్ కు కోహ్లీ

England : ప్రస్తుతం కోలుకుంటున్న కోహ్లీ సోమవారం బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో నిర్వహించే ఫిట్ నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు

England

ఇంగ్లాండ్ టూర్ లో మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ కోసం ఎంపికయ్యారు. అయితే కోహ్లీ ఫిట్ నెస్ సాధిస్తేనే వన్డే సిరీస్ లో ఆడతాడని బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల ఐపీఎల్ 19వ సీజన్ సందర్భంగా కోహ్లీ కాలికి గాయమైంది. ఈ కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ లో విరాట్ ఆడలేదు.

ప్రస్తుతం కోలుకుంటున్న కోహ్లీ సోమవారం బెంగళూరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో నిర్వహించే ఫిట్ నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. ఈ టెస్టులో పాసైతేనే కోహ్లీ వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. వన్డే ప్రపంచకప్ ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్న కోహ్లీకి ఇప్పటి నుంచి జరిగే ప్రతీ సిరీస్ కీలకంగానే చెప్పాలి.

అప్పటి వరకూ ఫామ్, ఫిట్ నెస్ తో ఉంటేనే జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారనేది తేలిపోయింది. ఇదిలా ఉంటే స్టార్ పేసర్ బుమ్రా ఇంగ్లాండ్(England) పై వన్డేలు ఆడబోతున్నాడు. వర్క్ లోడ్ కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్(England) టీ20 సిరీస్ లకు బుమ్రాను ఎంపిక చేయలేదు.

అయితే 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా బౌలింగ్ కాంబినేషన్ ను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు బుమ్రాను బరిలోకి దింపుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత బుమ్రా వన్డే ఫార్మాట్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చివరిసారిగా ఈ స్టార్ పేసర్ 2023 వన్డే ప్రపంచకప్ లో ఆడాడు.

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్(England) తో వన్డే సిరీస్ కు యశస్వి జైస్వాల్ ను పక్కన పెట్టడం ఆశ్చర్యపరిచింది. తాజాగా ముగిసిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో జైస్వాల్ రాణించాడు. చివరి వన్డే సెంచరీతో చెలరేగినా అతన్ని ఎంపికచేయకపోవడం చర్చనీయాంశమైంది. అటు స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు.

England

పేసర్లుగా బుమ్రాతో పాటు ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చోటు దక్కించుకున్నారు. ఆల్ రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. కాగా ఇంగ్లాండ్(England) లో భారత జట్టు పర్యటన జూలై 1 నుంచి మొదలుకానుండగా.. మొదట ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. అనంతరం జూలై 14 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.

ఇంగ్లండ్ వన్డేలకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ , వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

Numerology : నెంబర్ 2 వారిని ఎలా డీల్ చేయాలో తెలుసా?..2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారి క్వాలిటీస్ ఇవే..

Exit mobile version